జూన్ 19నుండి భారీ వర్షాలు.. ఈ జిల్లాలలో ఎండలు.. ఐఎండీ అలెర్ట్!

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం మందగమనంతో సాగుతున్నప్పటికీ, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్ 19 నుంచి ఒక వారం పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది.

మంత్రి పొంగులేటి ఉన్నత స్థాయి సమీక్ష

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరద ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వంటి అంశాలపై దృష్టి సారించారు.

కలెక్టర్లు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్లు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే సుమారు 10 శాతం లోటు నమోదైంది. అయినప్పటికీ, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి మధ్యస్థ వర్షాలు కురిసాయి.

ఈ నెల 19 నుంచి వారం రోజులు జోరుగా వర్షాలు

ఈ నేపథ్యంలో రానున్న మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరిస్తాయని, ఈ నెల 19 నుంచి వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జోరుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రభుత్వం ప్రజల భద్రతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టింది.

Telangana heavy rains from June 19 as monsoon spreads state wide heat waves in north telangana

ఉత్తర తెలంగాణలో ఎండలు, వడగాలులు

ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో మాత్రం వడగాలులు మరియు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రస్తుతం వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు మళ్ళీ సాధారణం కంటే 3 డిగ్రీలు పెరిగాయి. నేడు కూడా ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

భవిష్యత్ లో జిల్లా ఆస్పత్రుల్లో AI ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలు.. ప్రకటించిన మంత్రి
భవిష్యత్ లో జిల్లా ఆస్పత్రుల్లో AI ఆధారిత వ్యాధి నిర్ధారణ వ్యవస్థలు.. ప్రకటించిన మంత్రి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సలహా

ప్రజలు కూడా వాతావరణ హెచ్చరికలను పట్టించుకుని, అవసరమైనప్పుడు సహాయక చర్యల కోసం అధికారులను సంప్రదించాలని సూచించారు. వర్షాలు భారీగా కురిసే సమయంలో లోతట్టు ప్రాంతాలు, నదీ తీరాలు, వరద ముప్పు ఉన్న చోట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+