ఏపీ ప్రభుత్వ లక్ష్యం రూ 2 లక్షల కోట్ల పెట్టుబడులు - విశాఖ కేంద్రంగా..!!
బల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ద్వారా రూ 2 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
మరి కొద్ది గంటల్లో విశాఖ కేంద్రంగా కీలక ఘట్టం ప్రారంభం కానుంది. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. రూ 2 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నిర్ణయించింది. పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు శ్రీకారం చుడుతోంది. సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సదస్సు నిర్వహణ..లక్ష్యాలు..ఏర్పాట్ల గురించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో నిర్వహిస్తున్న ఈ సదస్సు కోసం ఇప్పటి వరకు దాదాపు 14 వేల రిజిస్టర్ చేసుకున్నారు. ముఖ్యమంత్రి ప్రసంగంతో రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు లాంఛనంగా ప్రారంభం కానుంది.
14 రంగాల్లో పెట్టుబడులే లక్ష్యంగా..
ఈ సదస్సు కోసం వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్స్, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు రానున్నట్లు మంత్రి అమర్నాధ్ వెల్లడించారు. మధ్నాహ్నం 2 గంటలకు లాంఛనంగా సదస్సు ప్రారంభం అవుతుందని చెప్పారు.రేపు కొన్ని ఎంవోయూలు చేయడానికి నిర్ణయించామని వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 150 పై చిలుకు స్టాల్స్ కు సంబంధించిన ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోపాటుగా, సీఎం జగన్ ప్రారంభిస్తారన్నారు. ఎంపిక చేసిన 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఇందుకు సంబంధించి సెక్టరల్ సెషన్స్ కూడా జరగనున్నాయన్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం జగన్ వారితో బ్యాక్ టూ బ్యాక్ మీటింగ్ లో పాల్గొంటారని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుంది అనే నమ్మకాన్ని రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలకి కల్పించామన్నారు. రేపు కూడా అదే నమ్మకాన్ని గ్లోబల్ పారిశ్రామిక వేత్తలకు కల్పించనున్నామని తెలిపారు.

46 దేశాల ప్రముఖులు హాజరు
ఈ సదస్సు ద్వారా రాష్ట్ర ఎకానమీని డెవలప్ చేయటంతో పాటుగా యువతకు ఉపాధి కల్పించటమే ముఖ్య ఉద్దేశమని మంత్రి అమర్నాధ్ స్పష్టం చేసారు. ఈ సదస్సు కోసం 46 దేశాల ప్రముఖులు విచ్చేస్తున్నారని చెప్పారు. 8-10 దేశాల రాయబారులు కూడా వస్తున్నారని వివరించారు. అతిధులకు ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శుక్రవారం రాత్రి విందు ఏర్పాటు చేసారని చెప్పేకొచ్చారు. డెలిగేట్స్ కు ఏపీ రుచులను పరిచయం చేయబోతున్నట్లు వివరించారు. ఏపీలో పెట్టుబడి పెట్టేవారికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించటానికి సిద్దంగా ఉందని మంత్రి స్పష్టం చేసారు.పెట్టుబడులు పెట్టేవారికి భూములు..అన్ని అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ఖరారైన ఎంవోయూలను వారు ఆరు నెలల్లో గ్రౌండ్ చేస్తే అదనంగా సాయం చేయమని సీఎం సూచించారని వెల్లడించారు. అదేవిధంగా, ఇన్వెస్ట్ మెంట్లను బేస్ చేసుకొని కొన్ని ఇన్సెంటివ్ లను క్రియేట్ చేశామన్నారు.

రూ 2లక్షల పెట్టుబడులే లక్ష్యం
ఈ సదస్సు వేదికగా మొత్తం రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిండమే సీఎం టార్గెట్ గా పెట్టుకున్నారని మంత్రి వెల్లడించారు. పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉండేలా కొత్త ఇన్వెస్ట్మెంట్ పాలసీని తీసుకువస్తున్నామన్నారు. ఎన్నికల కోడ్ సమస్య లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీని రేపే మేం ప్రకటిస్తామని.. లేదంటే 15 రోజుల తర్వాత దాన్ని ప్రకటిస్తామని చెప్పారు. పెట్టుబడుల కోసం వచ్చే ప్రతి అవకాశాన్ని సమీక్షిస్తామని వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం చేసుకునే ఎంవోయూలలో 80శాతం రియలైజ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన ఎంవోయూల మాదిరిగా కాకుండా, వాస్తవానికి దగ్గరగా పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగాలు కల్పించే విధంగా తాము చేసిన ఏర్పాట్లు గమనించిన తర్వాత పారిశ్రామిక వేత్తలతో ఒప్పందాలు చేసుకోవడం జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications