ఏపీ ప్రభుత్వం సంచలనం: పెగాసెస్ తో చంద్రబాబు - ఎలా వాడారంటే : సభా కమిటీ ఏర్పాటు ..!!
పెగాసెస్ పైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హాయంలో చోటు చేసుకున్న పెగాసెస్ వినియోగం వ్యవహారం పైన విచారించాలని నిర్ణయించింది. వివాదాస్పద పెగాసెస్ స్పై వేర్ సాఫ్టవేర్ ను చంద్రబాబు కొనుగోలు చేసారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. దీని పైన ఈ రోజు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు.. గుడివాడ అమర్నాధ్..అబ్బయ్య చౌదరి మాట్లాడారు. నాడు చంద్రబాబు హయాంలో వైసీపీ నేతలతో పాటుగా బీజేపీ నేతల ఫోన్ల పైన నిఘా పెట్టారంటూ ఆరోపించారు. నేరుగా జగన్ ను ఎదుర్కోలేక ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.

మమతా ఆషామాషీగా చెప్పరు..
మమతా బెనర్జీ దేశంలోనే పేరున్న రాజకీయ నేతగా అభివర్ణించిన వైసీపీ నేతలు.. ఇప్పుటి వరకు ఎందుకు మమతా బెనర్జీ వ్యాఖ్యలను ఖండించలేదని ప్రశ్నించారు. మంత్రి బుగ్గన ఈ పెగాసెస్ వ్యవహారం దేశ సమగ్రతకే కాకుండా.. రాష్ట్ర ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా చెప్పారు. టీడీపీ హాయంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఏబీ వేంకటేశ్వర రావు డ్రోన్ వ్యవస్థ అవసరంటూ ప్రభుత్వానికి 2017లో అభ్యర్దించారని..ఆయన సూచన మేరకు అదే సమయంలో ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఇందు కోసం టెండర్లు ఆహ్వానించగా నాలుగు సంస్థలు ముందుకొచ్చాయని చెప్పారు. అందులో ఏబీ వేంకటేశ్వర రావు తనయుడు సంస్థ మినహా మిగిలిన మూడు సంస్థలు పక్కకు వెళ్లిపోగా.. ఆయన తనయుడుకు ఇది అప్పగించే ప్రయత్నం జరిగిందని వివరించారు.

నాటి నిఘా చీఫ్ కుమారుడి సంస్థకే
ఆ సమయంలోనే ఏబీ వేంకటేశ్వరరావు రెండు సార్లు ఇజ్రాయిల్ వెళ్లివచ్చారని వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం నిధులు సైతం మంజూరు చేసారని..ఆ తరువాత ఆకస్మికంగా దీనిని రద్దు చేసుకున్నారని మంత్రి బుగ్గన చెప్పారు. ఆ సమయంలోనే వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల సైతం హైకోర్టులో రిట్ దాఖలు చేసారని గుర్తు చేసారు. ఇక, టీడీపీ ప్రభుత్వం నాడు ఈ రకంగా ప్రజల నుంచి పూర్తి సమాచారం తన వద్ద ఉంచుకుందని ఆరోపించారు. దీంతో పాటుగా ప్రజాసాధికార సర్వే.. సేవా మిత్ర ద్వారా పూర్తిగా వివరాలు తీసుకొని..టీడీపీకి ఓటు వేయని వారి ఓట్లు తొలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని వివరించారు. అయితే, ఊహించని దాని కంటే ముందుగానే ఎన్నికలు రావటంతో అది పూర్తిగా ముందుకు సాగలేదన్నారు.

పెగాసెస్ అధికారంగా చేయరు - సభాసంఘం ఏర్పాటు
ఇదే సమయంలో పెగాసెస్ అధికారికంగా చేసేది కాదని..చంద్రబాబు లాంటి వారు దీనిని దొంగ తనంగా నిర్వహించారనేది నేటి ప్రభుత్వ అభిప్రాయం. ఇక, మాదాపూర్ కేంద్రంగా లోకేష్ సన్నిహితుడు ద్వారా పూర్తిగా ప్రజల వివరాలను ఒక చోటకు చేర్చి.. ఎవరు టీడీపీ..ఎవరు వైసీపీ మద్దతు దారులో గుర్తించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. దీంతో..వైసీపీ నేతలతో పాటుగా సాధారణ ప్రజల సమాచారం ఉందనే అనుమానాలు తమకు ఉన్నాయని ప్రభుత్వం నుంచి మంత్రి..వైసీపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసారు. దీని పైన విచారణ కోసం సభా సంఘం ఏర్పాటు చేయాలని మంత్రి బుగ్గన కోరారు. ఇదే అంశాన్ని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సైతం స్పీకర్ ను సభా సంఘం ఏర్పాటు చేయాలని అభ్యర్దించారు. దీనికి స్పీకర్ అంగీకరించారు. రెండు మూడు రోజుల్లో సభా సంఘంలో ఎవరుండాలనే వివరాలతో సభా సంఘం ప్రకటిస్తామని స్పీకర్ ప్రకటించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications