అమరావతిలో మరో కీలక ఘట్టం..! శాశ్వత హైకోర్టుకు తొలి అడుగు..!

ఏపీ రాజధాని అమరావతి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోపు కీలక నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే సీఆర్డీయే ఆఫీసును పూర్తి చేసి ప్రారంభించింది. దీంతో పాటు సచివాలయ టవర్స్, ఇతర నిర్మాణాలను కూడా ఏకకాలంలో చేపడుతోంది. వీటికి కొనసాగింపుగా ఇవాళ శాశ్వత హైకోర్టు నిర్మాణానికి పునాదిరాయి పడింది. మున్సిపల్ మంత్రి నారాయణ సమక్షంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అమరావతి రాజధానిలో శాశ్వత హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనుల్ని మంత్రి నారాయణ ఇవాళ ప్రారంభించారు. ప్రత్యేక పూజల తర్వాత నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు ప్రారంభించారు. బీ ప్లస్ జీ ప్లస్ 7 అంతస్తుల్లో ఐకానిక్ టవర్స్ గా హైకోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ.. అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

AP High Court Construction Starts Today Grand Opening Eyed for 2027

మొత్తం 7 భవనాలను ఐకానిక్ భవనాలుగా నిర్మిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ ఇచ్చిన డిజైన్ తో ఈరోజు హై కోర్టు పనులు ప్రారంభించామన్నారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్ తో హై కోర్టు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. 2,4,6 వ అంతస్తుల్లో కోర్టు హాళ్లు ఉంటాయని పేర్కొన్నారు. 8వ అంతస్తులో ప్రధాన న్యాయమూర్తి కోర్టు ఉంటుందన్నారు. మొత్తం 45000 టన్నుల స్టీల్ ను భవనానికి వాడుతున్నట్లు ఆయన తెలిపారు. 2027 చివరికి హై కోర్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నారాయణ వెల్లడించారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అమరావతి పనులు ఆలస్యం అయ్యాయని ఆయన గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+