వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ-ఈసీ ఉత్తర్వుల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరణ..!
ఏపీలో వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ చేయించే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై రాష్ట్రంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం ఓ రేంజ్ లో కొనసాగుతోంది. అదే సమయంలో వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీ వీలుకాకపోవడంతో పింఛన్ దారుల ఇబ్బందులు దారుణంగా ఉన్నాయి. మరోవైపు ఈసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. దాన్ని కొట్టేసింది.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్న వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయించకుండా సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్ధ చేసిన విజ్ఞప్తిపై హైకోర్టు గతంలో ఈసీకి ఆదేశాలు ఇచ్చింది. వీటి ఆధారంగా ఈసీ కూడా వాలంటీర్లను పెన్షన్ల పంపిణీకి వాడొద్దని ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టులో పలువురు పెన్షన్లర్లు ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. పిల్ ను కొట్టేసింది.

వాలంటీర్ల వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కదా అని హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. వాలంటీర్లపై ఫిర్యాదులు పరిగణలోకి తీసుకొని ఈసీ నిర్ణయం తీసుకుందని హైకోర్టు తెలిపింది. ఈసీ ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు వెళ్లలేని వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇంటి దగ్గరకు వెళ్ళి అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సజావుగా పెన్షన్లు పంపిణీకి ఈసీ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నట్లు భావించిన హైకోర్టు.. ఈ పిల్ ను కొట్టివేసింది.












Click it and Unblock the Notifications