ఏపీలో ఖైదీలకు క్షమాభిక్ష ఇలాగేనా ? హైకోర్టు ఆగ్రహం-14 ఏళ్ల శిక్ష పూర్తికాకుండానే విడుదలా ?
ఏపీలో ఖైదీలకు క్షమాభిక్ష పెట్టే విషయంలో ప్రభుత్వ నిబంధనలు, సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగానే ఉన్నాయి. ఆగస్టు 15న క్షమాభిక్ష పెట్టాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాలన్న దానిపై ప్రభుత్వానికి కూడా క్లారిటీ ఉంది. కానీ ఈసారి ఆగస్టు 15న మాత్రం పలువురు ఖైదీలకు నిబంధనలకు విరుద్ధంగా క్షమాభిక్ష పెట్టినట్లు హైకోర్టు గుర్తించింది. దీంతో ఈ వ్యవరారంపై దాఖలైన వాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

ఆగస్టు 15న ఖైదీలకు క్షమాభిక్ష
ఏపీలో ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా పలువురు సుదీర్ఘ కాలం శిక్ష అనుభిస్తున్న ఖైదీలకు ప్రభుత్వాలు క్షమాభిక్ష ప్రసాదించడం గతం నుంచీ వస్తున్న సంప్రదాయమే. అయితే ఇలా విడుదల చేసే ఖైదీల విషయంలో ప్రభుత్వ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని పాటించాల్సి ఉంటుంది. లేకపోతే కోర్టులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పాటు ఆ నిర్ణయాన్ని కొట్టేసే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈసారి ఏపీలో ఖైదీలకు పంద్రాగస్టు రోజు ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షలు కూడా ఇదే కోవలో వచ్చినట్లు తెలుస్తోంది.

ఖైదీల క్షమాభిక్షపై అభ్యంతరాలు
ఈ ఏడాది పంద్రాగస్టున విడుదల చేసిన ఖైదీల విషయంలో ఇలాంటి అభ్యంతరాలే వచ్చాయి. తిరుపతి జిల్లాకు చెందిన ముడి నవనీతమ్మ అనే మహిళ తన భర్త పార్ధమరెడ్డిని హత్య చేసి జీవిత ఖైదు అనుభవిస్తున్న 8 మంది ఖైదీల్ని పంద్రాగస్టున విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. గతేడాది ఆగస్టు 15న వీరినే విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించడంతో నవనీతమ్మ పిటిషన్ దాఖలు చేయడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. తిరిగి ఈసారి ప్రభుత్వం వారికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల చేసేసింది. వీరిని తిరిగి జైలుకు పంపాలని ఆమె హైకోర్టును అభ్యర్ధించారు.

14 ఏళ్లు పూర్తి కాకుండానే క్షమాభిక్షా ?
ఈ పిటిషన్ లో ప్రభుత్వం విడుదల చేసిన ఖైదీల్లో కొందరు 8 ఏళ్లు, మరికొందరు 11 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకోగానే విడుదల చేసేశారని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనికి గవర్నర్ అధికారాల మేరకు వీరిని విడుదల చేసినట్లు ప్రభుత్వం సమాధానమిచ్చింది. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం కనీసం 14 ఏళ్లు జైలు శిక్ష పూర్తి చేసుకున్న ఖైదీలకు మాత్రమే క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చెప్తున్న విషయాన్ని గుర్తు చేసింది.

సర్కార్ తీరుపై హైకోర్టు ఆక్షేపణ
హత్య కేసులో జీవిత ఖైదు పడిన నేరస్తుల్ని 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకోకుండానే క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయమని ఏ నిబంధనలు చెబుతున్నాయని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కనీసం 14 ఏళ్ల శిక్ష పూర్తి చేసుకున్న జీవిత ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉంటేనే క్షమాభిక్షకు అర్హులను తేల్చిచెప్పింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు చూస్తుంటే ఖైదీల శిక్షను కుదించినట్లు కనిపిస్తోందని ఆక్షేపించింది. దీనిపై పూర్తి వివరాలతో వాదనలకు సిద్ధం కావాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచిస్తూ విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.
-
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications