ఆంధ్రా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రాసాద్ రెడ్డికి జైలు శిక్ష.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ పివిజిడి ప్రసాద్ రెడ్డిపై నమోదైన కోర్టు ధిక్కార కేసులో సంచలన తీర్పు వెలువరించింది. నూకన్న దొర కేసులో కోర్టు ధిక్కారానికి బాధ్యుడిగా తేల్చిన హైకోర్టు ధర్మాసనం ఆయనకు నెల రోజుల సాధారణ జైలు శిక్షతోపాటు, రెండు వేల రూపాయల జరిమానా విధించింది. ప్రసాద్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను పాటించలేదని హైకోర్టు నిర్ధారించింది.

కోర్టు ధిక్కార నేరం క్రింద సంచలన తీర్పు
అయితే ప్రసాద్ రెడ్డి తరఫున న్యాయవాది అభ్యర్థన మేరకు ఈ తీర్పు అమలును డిసెంబర్ 22వ తేదీ వరకు న్యాయస్థానం సస్పెండ్ చేసింది. కోర్టు ఉత్తర్వులనే ధిక్కరించడం కోర్టు పట్ల గౌరవం చూపకుండా మొండిగా వ్యవహరించడం ప్రసాద్ రెడ్డి చేసినట్టు హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది ఇటువంటి వ్యక్తి పైన కనికరం చూపించడం న్యాయవ్యవస్థకు నష్టమని ఘాటుగా వ్యాఖ్యలు చేసింది.

AP High Court sensational verdict on Former Andhra University VC Prasad Reddy to One Month Jail

కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ను విధులనుండి తొలగించిన వీసీ
అయితే అసలు ఇంతకీ ఏం జరిగిందంటే 19 సంవత్సరాల క్రితం 2006 జూలైలో ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలోని బోటనీ విభాగంలో చేరిన నూకన్న దొర కాంట్రాక్ట్ పద్ధతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా 17 ఏళ్ల పాటు సేవలు అందించారు. 2022 నవంబర్ 18వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాద్ రెడ్డి నూకన్న దొరను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

కోర్టు ఉత్తర్వులు బేఖాతరు.. వీసీ ప్రసాద్ రెడ్డి పైన కోర్టు ధిక్కార కేసు
అంతేకాకుండా 2022 మే నెల నుంచి ఆయనకు చెల్లించవలసిన జీతభత్యాలను కూడా నిలిపివేశారు. దీనిపైన నూకన్న దొర 2023 సంవత్సరంలో హైకోర్టును ఆశ్రయించగా మార్చి 7న న్యాయమూర్తి ఆయనను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనసాగించాలని మద్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కానీ వీసి ప్రసాద్ రెడ్డి ఆ ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో నూకన్న దొర అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డి పైన కోర్టు ధిక్కార కేసును ఫైల్ చేశారు.

జైలు శిక్ష, జరిమానా విధిస్తూ సంచలన తీర్పు
దీనిపైన హైకోర్టు ధర్మాసనం వాదనలు తాజాగా సంచలన తీర్పునిచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ప్రసాద్ రెడ్డి ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులను దిక్కరించినట్టు నిర్ధారించింది .ఫలితంగా ఈ ఏడాది నవంబర్ 24 శిక్ష, జరిమానా పడింది. అయితే తీర్పు ప్రతి తాజాగా వెల్లడయింది.

ఆరువారాల పాటు తీర్పు అమలు వాయిదా
హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు ప్రసాద్ రెడ్డి న్యాయవాది అభ్యర్థన మేరకు న్యాయస్థానం తీర్పు అమలును ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈలోపు అప్పీల్ చేయకపోయినా, స్టే రాకపోయినా డిసెంబర్ 22 సాయంత్రం ఐదు గంటల లోపు హైకోర్టు రిజిస్ట్రార్ ముందు ఆయన లొంగిపోవాలని ఆదేశాలు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+