ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టులో ట్విస్ట్-సామాజిక సేవపై రివ్యూ పిటిషన్-రిజిస్ట్రీ నో-జడ్డి ఓకే

ఏపీలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఏడాది పాటు పాటించకుండా నిర్లక్ష్యం వహించిన వ్యవహారంలో కోర్టు ధిక్కారం కింద విధించిన సామాజిక సేవ శిక్షపై ఐఏఎస్ శ్రీలక్ష్మి తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. ఏడాదిపాటు సామాజిక శిక్ష విధిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. హైకోర్టు తీర్పుపై రివ్యూ కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ కు నంబర్ కేటాయించేందుకు రిజిస్ట్రీ అంగీకరించకపోవడమే ఇందుకు కారణం.

హైకోర్టు ధిక్కారం కేసు

హైకోర్టు ధిక్కారం కేసు

ఏపీలోని స్కూళ్లలో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ గతంలో వైసీపీ సర్కార్ జారీ చేసిన ఆదేశాల్ని అమలు చేసిన ఐఏఎస్ అధికారులు చిక్కుల్లో పడ్డారు. వీటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చినా ఏడాది పాటు పట్టించుకోకపోవడంతో హైకోర్టు సీరియస్ అయింది.

దీంతో 8 మంది ఐఏఎస్ అధికారులకు రెండు వారాల జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ఆ తర్వాత సదరు ఐఏఎస్ లు హైకోర్టును మన్నించాలని వేడుకోవడంతో ఏడాది పాటు సామాజిక సేవ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వారు ఎక్కడెక్కడ చేయాలో కూడా హైకోర్టు క్లారిటీ ఇచ్చింది. దీనిపైనా వారిలో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది.

శ్రీలక్ష్మి రివ్యూ పిటిషన్

శ్రీలక్ష్మి రివ్యూ పిటిషన్

హైకోర్టు ధిక్కార కేసులో ఏడాది పాటు సామాజిక సేవ చేయాలంటూ విధించిన శిక్షను పునస్సమీక్షించాలంటూ ఈ ఎనిమిది మంది ఐఏఎస్ లలో ఒకరైన ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. విధి నిర్వహణలో బిజీగా ఉండటం, సామాజిక సేవ చేసేందుకు వీలు కుదరకపోవడం వంటి కారణాలతో ఆమె రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రివ్యూ పిటిషన్ విచారణకు స్వీకరించే విషయంలో హైకోర్టు రిజిస్ట్రీలో ఆమెకు ట్విస్ట్ ఎదురైంది.

శ్రీలక్ష్మి పిటిషన్ కు నంబర్ కేటాయించని రిజిస్ట్రీ

శ్రీలక్ష్మి పిటిషన్ కు నంబర్ కేటాయించని రిజిస్ట్రీ

గతంలో హైకోర్టు తనకు విధించిన ఏడాది సామాజిక సేవా శిక్షను పునస్సమీక్షించాలంటూ ఐఏఎస్ శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న పిటిషన్ కు రిజిస్ట్రీ నంబర్ కేటాయించేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్ విచారణార్హతపై రిజిస్ట్రీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ విషయంలో ట్విస్ట్ ఏర్పడింది. చివరికి గతంలో ఈ తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

శ్రీలక్ష్మి రివ్యూ పిటిషన్ పై జడ్డి క్లారిటీ

శ్రీలక్ష్మి రివ్యూ పిటిషన్ పై జడ్డి క్లారిటీ

శ్రీలక్ష్మి దాఖలు చేసుకున్న రివ్యూ పిటిషన్ కు రిజిస్ట్రీ విచారణార్హత లేదంటూ నంబర్ కేటాయించకపోవడంపై హైకోర్టులో విచారణ జరిగింది. దీంతో ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను జడ్డి జస్టిస్ బట్టు దేవానంద్ తోసిపుచ్చారు. తమ తీర్పుపై రివ్యూ చేసే అధికారం తమకు ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఈ పిటిషన్ కు విచారణార్హత ఉందని కూడా తెలిపారు. అయితే శ్రీలక్ష్మి దాఖలు చేసిన ఈ అనుబంధ పిటిషన్ ను విచారించి దీనికి విచారణార్హత ఉందో లేదో నిర్ణయిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+