వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ ఐసెట్ ఫ‌లితాల విడుద‌ల: టాప్-10 ర్యాంకర్లు వీరే..

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి: ఏపీ ఐసెట్-2019 ప‌రీక్ష‌ల ఫలితాలు విడుద‌ల‌య్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు, శ్రీ వెంకటేశ్వర విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్స‌ల‌ర్ సంయుక్తంగా బుధ‌వారం విజ‌య‌వాడ‌లో ఈ ఫ‌లితాల‌ను విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాల కోసం తిరుప‌తిలోని శ్రీవేంక‌టేశ్వ‌ర విశ్వ‌విద్యాల‌యం ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించింది. మొత్తం 52,736 మంది దరఖాస్తు చేసుకున్నారు వారిలో 48,445 మంది ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ విద్యాసంవ‌త్స‌రంలో సుమారు అయిదువేల మంది విద్యార్థులు అధికంగా ద‌ర‌ఖాస్తుల‌ను చేసుకున్నారు. ఫ‌లితాల కోసం sche.ap.gov.in వెబ్‌సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.టాప్ టెన్ ర్యాంకర్లు..

గుంటూరు జిల్లాకు చెందిన కారుమూరి నాగసుమంత్ తొలిర్యాంకును సాధించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కావ్యాశ్రీ ద్వితీయ, విజయవాడకి చెందిన నరహరి శెట్టి శివసాయి పవన్ తృతీయ‌ ర్యాంకును సాధించారు. యాగంటి మునిచంద్రారెడ్డి నాలుగో ర్యాంకును చేజిక్కించుకున్నారు. భానుప్రకాశ్‌-5, వెంకట నాగేంద్ర-6, పానుగంటి వెంకటలక్ష్మి కిరణ్మయి-7, కలతూరు భానుప్రకాశ్‌రెడ్డి-8వ ర్యాంకును తెచ్చుకున్నారు. ఆనెం అఖిల్‌- 9, అంబటి సురేంద్రరెడ్డి 10వ ర్యాంకును సాధించారు.

 AP ICET 2019 results

90కి పైగా ఉత్తీర్ణ‌త శాతం
ఐసెట్‌ ఫలితాల్లో మొత్తం 90.27 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 26,002 మంది బాలురు, 22,443 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించిన‌ట్లు విజ‌య రాజు తెలిపారు. ఈ నెల 15 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించనున్నారు. జులై మూడో వారం నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. విద్యార్థుల కోసం వ‌చ్చే జులైలో కౌన్సెలింగ్ నిర్వ‌హిస్తామ‌ని విజ‌య రాజు తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి ర్యాంకు కార్డులును త‌మ అధికారిక వెబ్‌సై్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని అన్నారు.

English summary
Andhra Pradesh Integrated Common Entrance Test (AP ICET) 2019 test results have been announced by the state higher education council chairman Vijaya Raju and SV University Vice-Chancellor on Wednesday in Vijayawada. Candidates who have appeared for AP ICET 2019 test can now check their results on the official website. This year a total of 52,736 applications have been received, where 48,445 candidates have attended for the exam. In which 43,731 candidates have qualified in the test.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X