ఓటుకు నోటు ఎఫెక్ట్: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ బదలీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముగ్గురు అధికారులు బదలీ అయ్యారు. ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అనురాధను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అడిషనల్ డీజీగా బదలీ చేశారు.
కొత్త ఇంటెలిజెన్స్ డీజీగా ఏబీ వెంకటేశ్వర రావును నియమించారు. అలాగే, విజయవాడ పోలీసు కమిషనర్‌గా గౌతమ్ సావంగ్‌ను నియమించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న అనురాధ స్థానంలో వెంకటేశ్వర రావును నియమించారని తెలుస్తోంది.

నెల రోజులకు పైగా ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య వేడిని రాజేస్తోన్న విషయం తెలిసిందే. ఓటుకు నోటు, ఏపీ ముఖ్యుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ గుర్తించలేకపోయిందని ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అనురాధ పైన వేటు పడుతుందని చాలా రోజుల క్రితమే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు ఆమెను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అడిషనల్‌కు బదలీ చేశారు. అనురాధ బదలీకి ప్రధానంగా ఓటుకు నోటు వ్యవహారమే కారణమని అంటున్నారు.












Click it and Unblock the Notifications