ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2025 మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 1 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.

వచ్చే మార్చి 3వ తేదీ నుంచి మార్చి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. మొదట పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి నారా లోకేష్.. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పరీక్షల తేదీలను రిలీజ్ చేశారు.

AP Intermediate Exam Schedule Released


విద్యార్థులు ప్రిపరేషన్‌పై దృష్టి సారించేందుకు, సరిగా ప్లాన్ చేసుకునేందుకు ఇదే సరైన సమయమని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ అన్నారు. ఒత్తిడికి గురికాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మంచి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించేలా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా ప్రణాళిక చేసినట్లు తెలిపారు. విద్యార్థులందరికీ ఈ సందర్భంగా నారా లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఇలా

వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేకుండా రోజు విడిచి రోజు పరీక్ష ఉండేలా జాగ్రత్త తీసుకున్నామని మంత్రి తెలిపారు. విద్యార్థులు ఈ వెసులుబాటును సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధిస్తారని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+