పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కలెక్షన్లు అంబటి రాంబాబు పెంచుతున్నారట!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా రిలీజ్ అయిన నాటి నుండి రికార్డులు సృష్టిస్తూ బాక్సాఫీస్ బద్దలు కొడుతుంది. సినిమా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. బ్రో సినిమాలో తనని కించపరిచే విధంగా డాన్సులు పెట్టారని ఏపీ వైసీపీ నాయకుడు మంత్రి అంబటి రాంబాబు రెండు రోజులుగా బ్రో సినిమాను, పవన్ కళ్యాణ్ ను , బ్రో నిర్మాతను టార్గెట్ చేస్తున్నారు.
బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పైన కూడా ఆయన విమర్శలు గుప్పించారు. టీజీ విశ్వప్రసాద్ ఒక ఎన్నారై అని, అమెరికా నుంచి పవన్ కి వస్తున్న డబ్బులు పెద్ద స్కామ్ అని పేర్కొన్న అంబటి రాంబాబు పవన్ కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు ముఠా ఎలా తన మనిషి విశ్వప్రసాద్ ద్వారా అందిస్తున్నారో తెలుస్తుంది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సినిమాకు ఏపీ రాజకీయాలకు లింకు పెట్టి అంబటి రాంబాబు చేసిన సంచలన వ్యాఖ్యలకు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. సినిమాకు అంబటి కి సంబంధం ఏమిటి అని ప్రశ్నించిన ఆయన, శ్యాం బాబు చేసిన డాన్స్ కు, సంక్రాంతి సంబరాలలో రాంబాబు చేసిన డాన్స్ కు ఏమాత్రం సింక్ లేదని పేర్కొన్నారు. సినిమాలో శ్యాం బాబు రాజకీయ నాయకుడు కాదని, మ్యూజిక్ కూడా ఒకటి కాదని క్లారిటీ ఇచ్చారు .
కేవలం ఒక్క టీ షర్టు మ్యాచ్ అవుతుందని, దానిని పట్టుకుని వివాదం చేయడం సరైనది కాదని మండిపడ్డారు. అసలు తనకు సంబంధం లేని విషయంలో మంత్రి రాంబాబు ఆరోపణలు చేయడాన్ని తప్పు పట్టారు. తనను కించపరచడానికి ఈ పాత్ర పెట్టారని ఆయన అనుకుంటే తాము ఏమి చేయలేమని, ఆయన చేసే ఆరోపణలు తమ సినిమా ప్రచారానికి ఉపయోగపడతాయని తద్వారా తమకు కలెక్షన్లు కూడా పెరుగుతాయని నిర్మాత విశ్వ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

అంబటి చేసిన వ్యాఖ్యలు ఆయన పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడతాయని ఆయన భావిస్తున్నట్టు ఉన్నారన్నారు. తమకు రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని సినిమాలు చేయాల్సిన అవసరం లేదని, ప్రజలకు అన్నీ తెలుసని నిర్మాత విశ్వప్రసాద్ వ్యాఖ్యానించారు. సినిమాల్లో చూపించినవన్నీ నిజమని ప్రజలు అనుకోరని ఆయన తెలిపారు. ఇప్పటికైనా అంబటి రాంబాబు తమపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.












Click it and Unblock the Notifications