Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోకేష్ తీరుపై మంత్రి అవంతి సెటైర్లు-చావు పరామర్శా ? యుద్ధమా ? పనిలేని ప్రతిపక్షం

గుంటూరులో తాజాగా దళిత యువతి రమ్య హత్య నేపథ్యంలో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లి టీడీపీ నేత నారా లోకేష్ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్ ) ఆరోపించారు. నారా లోకేష్ తీరుపై ఇవాళ మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పనిలేని ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉందని మంత్రి అవంతి ఆరోపించారు. చంద్రబాబు కుమారుడుగా తప్పితే.. ఏ అర్హతా లేని లోకేష్ ఈ మధ్య వెయిట్ తో పాటు విచక్షణ కూడా కోల్పోయి ముఖ్యమంత్రిగారిని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని అవంతి ఆక్షేపించారు. రమ్యను కోల్పోయి వారి కుటుంబం బాధలో ఉంటే.. ఓదార్చాల్సిందిపోయి, గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాన్ని తీసుకువెళ్ళకుండా అడ్డుకోవడం, పోలీసులపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేయడం బాధాకరమన్నారు.. ముఖ్యమంత్రి జగన్ ను వ్యక్తిగతంగా దూషించినంత మాత్రాన జీరోగా ఉన్న లోకేష్ ఎప్పటికీ హీరో కాలేడు అన్నది గుర్తుంచుకోవాలని మంత్రి అవంతి తెలిపారు.

ap minister avanthi srinivas slams nara lokesh for his gesture at dalit girl ramyas family visit

నాయకుడు అంటే జగన్ లా ఆదర్శంగా ఉండాలి తప్పితే.. చిల్లర రాజకీయాలు చేయకూడదని మంత్రి తెలిపారు. లోకేష్ గ్రామ స్థాయి నాయకుడి కంటే హీనంగా మాట్లాడుతున్నాడన్నారు.. అమెరికాలో చదివిన లోకేష్.. ఇటువంటి భాషను మాట్లాడటం ఎంతవరకు సబబో తనకు తానే ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.. ముఖ్యమంత్రిని ప్రస్తావిస్తూ.. వ్యక్తిగతంగా దూషణలు చేయడం లోకేష్ మానుకోవాలన్నారు.. లోకేష్ వచ్చిన తర్వాతే.. రాజకీయాల్లో ఇటువంటి బూతుల ట్రెండ్ ను కొత్త ట్రెండ్ గా తెచ్చాడని మంత్రి అవంతి విమర్శించారు. యుద్ధంలో జయించిన హీరో మాదిరిగా నిన్న రమ్య కుటుంబ సభ్యుల పరామర్శకు వెళ్ళిన లోకేష్.. నుదుటున పెద్ద బొట్టుపెట్టుకుని, కారు దగ్గర పిడికిలి బిగించి చూపిస్తూ సంకేతాలు ఇస్తూ, పోలీసులపై దౌర్జన్యం చేస్తూ, నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంటి...?. పెళ్ళికి, చావుకీ ఒకే మంత్రం అన్నట్టుగా లోకేష్ చేష్టలు ఉన్నాయని మంత్రి అవంతి ఆక్షేపించారు.

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య దారుణ హత్య రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ప్రభుత్వం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. హోం మంత్రి సుచరిత నిన్న బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి, వారికి సాయాన్ని అందించి, ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారని అవంతి గుర్తుచేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థినిని ఈ విధంగా హత్య చేయడం చాలా బాధాకరమన్నారు. సోషల్ మీడియా ద్వారాగానీ, ప్రత్యక్షంగా కానీ మహిళలు, యువతులపై ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేకపోతే దిశ యాప్ ద్వారా కంప్లైంట్ చేయాలని అవంతి సూచించారు. దిశ యాప్ ను ప్రతి ఒక్క మహిళ, యువతి డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+