రేపు రాష్ట్రపతితో రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సమావేశం;ఉపరాష్ట్రపతికి చికిత్స
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు సోమవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని ఆయన ఈ సందర్భంగా వినతి చేయనున్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగాన్ని, ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాసే విధంగా ఉందని మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీల్లో నెలకొన్న అభద్రత భావాన్ని తొలగించాలని మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేస్తున్నారు. దళిత, గిరిజనుల హక్కులను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో కంటి చికిత్స చేయించుకున్నారు. వైద్యులు ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడుకు కాటరాక్ట్ చికిత్స అందించారు. చికిత్స అనంతరం వెంకయ్యనాయుడు ఇంటికి బయలుదేరి వెళ్లారు. వెంకయ్య నాయుడుకు కంటి చికిత్స సంతృప్తికరంగా జరిగిందని, అయితే ఈ చికిత్సకు సాధారణంగానే కొద్దిరోజుల పాటు విశ్రాంతి అవసరమని, ఆ ప్రకారమే వెంకయ్య నాయుడు కూడా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications