అమిత్‌షాకు లోకేష్ కౌంటర్: 4 ఏళ్ళుగా అంధకారంలో నెట్టిన బిజెపిని బాయ్‌కాట్ చేయాలి
అమరావతి: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఐదు కోట్ల ప్రజలు పోరాటం చేస్తోంటే ప్రజలను కుక్కలతో పోల్చడం సరైందేనా అని లోకేష్ ప్రశ్నించారు.ఏపీ నుండి బిజెపిని బాయ్‌కాట్ చేయాలని లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఏపీ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఆందోళన చేస్తోంటే ప్రజలను పాములు, కుక్కలంటూ జంతువులతో పోలుస్తారా అంటూ అమిత్‌షా చేసిన ట్వీట్‌కు లోకేష్ ట్విట్టర్‌లో ఘాటుగా సమాధానమిచ్చారు.

తలపొగరుతో ఏపీ ప్రజలను జంతువులతో ఏపీ ప్రజలను పోల్చిందని లోకేష్ అమిత్ షాపై మండిపడ్డారు. బిజెపికి విపరీత కాలం దాపురించిందని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే ఏపీ ప్రజలను జంతువులతో పోల్చారని లోకేష్ అభిప్రాయపడ్డారు.
ఏపీ రాష్ట్రాన్ని బిజెపి నాలుగేళ్ళుగా అంధకారంలో ముంచెత్తిందని లోకేష్ విమర్శించారు. ఏపీని ఇబ్బందులకు గురిచేసిన బిజెపిని బాయ్‌కాట్ చేయాల్సిన అవసరం ఉందని ట్విట్టర్ వేదికగా లోకేష్ ఏపీ ప్రజలను కోరారు.












Click it and Unblock the Notifications