పప్పు ఇది చెప్పు : లోకేష్ కు రోజా స్ట్రాంగ్ కౌంటర్- ముందు నీ కొడుకు మీద ప్రమాణం చేయ్..

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ లో మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం జగన్ ను టార్గెట్ చేసుకుని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ చేసిన సవాల్ కు మంత్రి ఆర్కే రోజా ఇచ్చిన ఘాటు కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జగన్ బాబాయ్ హత్యతో తనకు సంబంధం లేదని తిరుమల వెంకన్నపై తాను ప్రమాణం చేశానని, ఇప్పుడు తనకు సంబంధం లేదని జగన్ కూడా ప్రమాణం చేయాలని లోకేష్ ఇవాళ సవాల్ విసిరారు. దీంతో సవాళ్ల యుద్ధం మొదలైంది.

లోకేష్ విసిరిన సవాల్ కు మంత్రి ఆర్కే రోజా స్పందించారు. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న పలు ఘటనలతో పాటు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఘటనల్ని కూడా కలిపి లోకేష్ కు ఘాటు కౌంటర్ ఇచ్చారు. ముందు వీటిపై తన కొడుకు మీద ప్రమాణం చేయాలంటూ రోజా సవాల్ విసిరారు. వీటిలో చాలా మటుకు గతంలో వైసీపీ చేసిన విమర్శలే కాగా.. మరికొన్ని కొత్త అంశాల్ని కూడా తెరపైకి తెచ్చి రోజా ఈ ట్వీట్ పెట్టారు. దీంతో ఇప్పుడు రోజా విసిరిన సవాల్ కు లోకేష్ ఎలా స్పందిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

ap minister rk roja strong counter to nara lokesh in a tweet on oath challenge

రోజా తన ట్వీట్ లో టీడీపీ హయాంలో జరిగిన అమ్మవారి గుడిలో కిరీటాల దొంగతనం, క్షుద్ర పూజలు, 40 గుడులను కూల్చివేత, సదావర్తి భూముల్ని అమ్మకాలు వంటి అంశాల్ని ప్రస్తావించారు. అలాగే వైసీపీ హయాంలో జరిగిన అంతర్వేది రథం దహనం, విజయనగరం జిల్లాలో రాముడి విగ్రహం ధ్వంసం వంటి అంశాల్ని కూడా లాగారు.చివరికి నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు అంటూ లోకేష్ కు సవాల్ విసిరారు. దీంతో ఇప్పుడు రోజా ఇచ్చిన కౌంటర్ వైసీపీ, టీడీపీల్లో చర్చనీయాంశమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+