ప్రీతి ఘటనతో ఏపీ సర్కార్ అప్రమత్తం-కాలేజీల్లో ర్యాగింగ్ పై మంత్రి రజనీ కీలక ఆదేశాలు..

తెలంగాణలో చోటు చేసుకున్న మెడికో ప్రీతి మరణంతో ఏపీ సర్కార్ కూడా అప్రమత్తమైంది. ర్యాగింగ్ నిరోధానికి కీలక ఆదేశాలు ఇచ్చింది.

ర్యాగింగ్ విష‌యంలో రాష్ట్రంలోని అన్ని మెడిక‌ల్ క‌ళాశాల‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశాలు ఇచ్చారు. తాజాగా హైద‌రాబాదులో మెడికో ఆత్మ‌హ్య‌త ఘ‌ట‌న నేప‌థ్యంలో మంత్రి రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేటు మెడిక‌ల్ క‌ళాశాల‌ల ప్రిన్సిప‌ల్స్ తో మంగళగిరిలోని వైద్యారోగశాఖ కార్యాలయంలో కీలక స‌మీక్ష నిర్వ‌హించారు.

ర్యాగింగ్ విష‌యంలో అన్ని మెడిక‌ల్ క‌ళాశాల‌లు క‌ఠినంగా ఉండాల‌ని మంత్రి రజనీ స్ప‌ష్టంచేశారు. మెడికోల‌పై ఎక్క‌డా, ఎలాంటి వేధింపులు ఉండ‌టానికి వీల్లేద‌న్నారు. క‌ళాశాల‌ల్లోని యాంటీ ర్యాగింగ్ క‌మిటీలు పూర్తిస్థాయిలో చురుకుగా ప‌నిచేయాల‌న్నారు. ర్యాగింగ్‌, ఇత‌ర వేధింపుల‌కు సంబంధించి ఆయా క‌ళాశాల‌ల‌పై నేరుగా డీఎంఈ, హెల్త్ యూనివ‌ర్సిటీ వీసీ ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌న్నారు. ఆయా క‌ళాశాల‌ల నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు యాంటి ర్యాగింగ్ క‌మిటీల ద్వారా నివేదిక‌లు తెప్పించుకుంటూ ఉండాల‌న్నారు.

ap minister vidadala rajani key order on ragging in colleges in wake of preethi case

విద్యార్థుల‌తో బోధ‌నా సిబ్బంది స‌హృద్భావంతో ఉండాల‌ని మంత్రి రజనీ సూచించారు.కొంత‌మంది సీనియ‌ర్ అధ్యాప‌కులు వారి సొంత క్లినిక్‌ల నేప‌థ్యంలో పీజీ విద్యార్థుల‌పై ప‌నిభారం మోపే పద్ధతి మారాలన్నారు. చ‌దువుల్లో నాణ్య‌తే కాద‌ని, భ‌ద్ర‌త కూడా ఉండాల‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ప‌టిష్ట‌మైన చ‌ర్య‌ల ద్వారా మ‌నం సుర‌క్షితంగా మెడికోల‌ను స‌మాజంలోకి తీసుకురాగ‌ల‌మ‌ని చెప్పారు. అన్ని మెడిక‌ల్ క‌ళాశాల‌ల్లో విద్యార్థుల‌కు కౌన్సెలింగ్ సెష‌న్లు ఉండేలా చూసుకోవాల‌న్నారు. ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డేలా విద్యార్థుల‌కు యోగా, ధ్యానం లాంటి అంశాల‌పై అవ‌గాహ‌న పెంచాల‌న్నారు.

ap minister vidadala rajani key order on ragging in colleges in wake of preethi case

క‌ళాశాల‌ల్లో ఫిర్యాదుల పెట్టెలు అందుబాటులో ఉంచాల‌ని, ఏదైనా స‌మాచారాన్ని వెనువెంట‌నే చేర‌వేసేలా క్యాంప‌స్‌లో ప‌లు చోట్ల మైక్‌లు ఏర్పాటుచేసుకోవాల‌ని మంత్రి రజనీ సూచించారు. ముఖ్య‌మైన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉండేలా చూడాల‌న్నారు. ప్ర‌తి విద్యార్థిని దిశ యాప్ ను వాడుకునేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. సీనియ‌ర్‌, జూనియ‌ర్ విద్యార్థుల‌కు ప్ర‌త్యేక వ‌స‌తి ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. వారి భోజ‌న స‌మ‌యాలు కూడా ఒకేలా ఉండ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు. మ‌న రాష్ట్రంలోని ఏ ఒక్క మెడిక‌ల్ క‌ళాశాల‌లో కూడా ఎక్క‌డా ఒక్క ర్యాగింగ్ కేసు కూడా న‌మోదు కావ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టంచేశారు.

ap minister vidadala rajani key order on ragging in colleges in wake of preethi case

ఎన్ ఎం సీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచి ప్ర‌తి మెడిక‌ల్ కళాశాల డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ ను అమ‌లు చేయాల్సి ఉంద‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ఈ డీఆర్ కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి పీజీ విద్యార్థి మూడు నెల‌ల పాటు క‌చ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ప‌నిచేయాల్సి ఉంద‌ని చెప్పారు. ప్ర‌తి మెడిక‌ల్ క‌ళాశాల ప్రిన్సిపాల్‌కు వారి ప‌రిధిలో మ్యాప్ చేసిన డీహెచ్‌, ఏహెచ్, సీహెచ్‌సీ, పీహెచ్‌సీల జాబితాను ఇప్ప‌టికే పంపామ‌ని తెలిపారు. ఆ జాబితాలో ఉన్న ఆస్ప‌త్రుల్లో పీజీ లు క‌చ్చితంగా మూడు నెల‌లు ప‌నిచేసేలా షెడ్యూల్ త‌యారుచేసుకుని పంపాల‌ని పేర్కొన్నారు. దీనివ‌ల్ల ప్ర‌తి మూడు నెల‌ల‌కు 250 మంది చొప్పున స్పెష‌లిస్టు వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో ప‌నిచేసే ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌న్నారు. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు చేకూరుతుంద‌ని చెప్పారు. ప‌ల్లెల్లో ఉండే పేద ప్ర‌జ‌లు మెరుగైన వైద్య సేవ‌లు పొందే అవ‌కాశం ద‌క్కుతుంద‌న్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+