బాబునే అంత మాట అంటావా, రాజధానికి ఎందుకొచ్చావ్: జగన్‌పై నారాయణ

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలు సోమవారం నాడు మండిపడ్డారు.

సీఎం చంద్రబాబును జంగిల్ రాజ్ అని జగన్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే చెరకు తోటకు నిప్పు పెట్టారని ఆరోపించారు. ఈ అంశం విచారణలో ఉందన్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి రాని జగన్ పరామర్శల పేరిట ఎందుకు రాజధాని ప్రాంతాలకు వచ్చారో చెప్పాలని నిలదీశారు.

లంక భూముల సమస్యల పైన రాజధాని ప్రాంత రైతుల కమిటీ విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబును సోమవారం కలిసిందని తెలిపారు. సమస్యలపై ప్రత్యేక కమిటీ వేయాలని ముఖ్యమంత్రి సూచించినట్టు వారు మీడియాకు వివరించారు.

AP Ministers counter to YS Jagan

కాగా, జగన్ సోమవారం రాజధాని ప్రాంతం తుళ్లూరులో పర్యటించిన విషయం తెలిసిందే. తుళ్లూరు మనండలం ఉద్దండరాయనిపాలెంలో రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. పేదల భూములను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు.

దళితులపై దాడులను పట్టించుకోవడం లేదు: శైలజానాథ్

దళితుల పైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి శైలజానాథ్ అన్నారు. దళితులపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వికె సింగ్ పైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిని నిరసిస్తూ 28న అంబేడ్కర్ విగ్రహాల ఎదుట దీక్ష చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+