‘భూమిని బలవంతంగా తీసుకున్నామని నిరూస్తారా?’
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని కోసం ఏ రైతు నుంచి బలవంతంగా భూమి తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, కె. అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారని... బలవంతంగా తీసుకున్నట్లు నిరూపించగలరా? అని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు.
శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం అనంతరం మంత్రులు మాట్లాడుతూ... కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక ఉపయోగపడుతుందని వారు తెలిపారు. గవర్నర్ ప్రసంగంలో వాస్తవరూపంలో ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.

ప్రాజెక్టులు పూర్తి చేసి రైతులకు మేలు చేయడానికి జీవో 22 విడుదల చేశామన్నారు. 9 మంది నిపుణులతో సమీక్షించిన తర్వాతే ధరల పెంపును నిర్ణయించామని వారు గుర్తు చేశారు. వరద జలాలు కృష్ణా డెల్టాకు మళ్లించి రాయలసీమ రైతులకు నీరందిస్తామని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, కె. అచ్చెన్నాయుడు చెప్పారు.
12న ఏపీ బడ్జెట్
ఏపీ బడ్జెట్‌ను మార్చి 12వ తేదీన 12 గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. గవర్నరు ప్రసంగం బాగుందని మంత్రి పేర్కొన్నారు. అన్ని అంశాలను గవర్నరు ప్రసంగంలో చేర్చినా వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.
ధరల పెరుగుదల వల్లే వివిధ ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాల వ్యయం పెంచాల్సి వస్తుందన్నారు. వైయస్ హయాంలోని ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణ పనులు కాంట్రాక్టర్లకు భారంగా మారాయని అందుకే వ్యయం పెంచాల్సివస్తుందన్నారు. రాజధాని నిర్మాణం కోసం బలవంతంగా భూములు తీసుకోలేదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిపిలు, జడ్పీటీసిలు కూడా భూములిచ్చారని యనమల తెలిపారు.












Click it and Unblock the Notifications