జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు..!అంతా ఇదే చర్చ.. !
కూటమి వర్సెస్ వైసీపీ గా సాగిపోతున్న ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అంటేనే గిట్టని కూటమి పార్టీల నాయకులు ఈ మధ్య ఆయన్ను మరో కొత్త పేరుతో పిలుస్తున్నారు. కూటమి పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు పలు చోట్ల ప్రెస్ మీట్లు పెడుతున్నప్పుడు, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పదే పదే ఈ పేరును ప్రస్తావిస్తున్నారు. తద్వారా జగన్ తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ మధ్య ఏపీలో ఎక్కడ చూసినా కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్ ను వర్క్ ఫ్రమ్ బెంగళూరు అనే కొత్త పేరుతో పిలుస్తున్నారు. సాధారణంగా వర్క్ ఫ్రమ్ హోం అనే పేరు ప్రచారంలో ఉంది. దీన్ని కాస్త మార్చి వర్క్ ఫ్రమ్ బెంగళూరు పేరుతో జగన్ ను వీరు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు తమ ప్రెస్ మీట్లలో సైతం జగన్ ను విమర్శించాల్సి వచ్చినప్పుడు ఈ కొత్త పేరుతో వారు సంబోధిస్తున్నారు.

ప్రతీ వారం జగన్ బెంగళూరుకు వెళ్లడం పరిపాటిగా మారిపోయింది. వారంలో సోమవారం బెంగళూరు నుంచి అమరావతికి వచ్చే వైఎస్ జగన్ తిరిగి గురువారం సాయంత్రానికి బెంగళూరుకు తిరిగి వెళ్లిపోతున్నారు. తిరిగి శుక్రవారం, శనివారం, ఆదివారం అక్కడే ఉండిపోయి సోమవారం తిరిగి వస్తున్నారు. దీంతో కూటమి పార్టీల నేతలంతా ఇప్పుడు జగన్ ను వర్క్ ఫ్రమ్ బెంగళూరుగా అభివర్ణిస్తున్నారు. అయితే ఈ కొత్త పేరు కూటమిలో ఎవరు కనిపెట్టారనే క్లారిటీ లేకపోయినా నాయకులంతా వరుసగా వాడిపారేస్తున్నారు. దీనిపై వైసీపీ వర్గాలు మాత్రం ఇప్పటివరకూ కౌంటర్ ఇవ్వలేదు.
గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ విపక్షంగా ఉండగా ఇలాగే హైదరాబాద్ లో ఎక్కువగా ఉండిపోయేవారు. అప్పట్లో వీరు రాష్ట్రానికి గెస్ట్ లుకా వచ్చి వెళ్లిపోతున్నారంటూ వైసీపీ విమర్శలు గుప్పించేది. ఆ తర్వాత ఎన్నికలు సమీపించాక చంద్రబాబు, పవన్ రాష్ట్రంలోనే ఉండి ప్రచారం చేశారు. ఇప్పుడు వీరి తరహాలోనే జగన్ బెంగళూరుకు వెళ్లిపోతుండటంతో ఆయన్ను వర్క్ ఫ్రమ్ బెంగళూరు పేరుతో వీరు ట్రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications