విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి ఎమ్మెల్యే ఆర్కేపై ఏపీ పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

విజయవాడ: మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జె. శ్రీనివాస్, గౌరవాధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.

పోలీసులను ఉద్దేశించి ఎమ్మెల్యే ఆర్కే చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పోలీసు అధికారుల సంఘం నేతలు మండిపడ్డారు. ఆర్పీ ఠాకూర్ ఏసీబీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాక అవినీతిపరుల పట్ల ఎలా వ్యవహరిస్తున్నారో ఎమ్మెల్యేకు కనిపించడం లేదా? అని....పోలీసు అధికారుల సంఘం నేతలు ప్రశ్నించారు.

AP Police Officers Association demands apology from YCP MLA RK.

Recommended Video

స్పీకర్ ఓకే: 5గురు వైసీపీ ఎంపీల రాజీనామా ఆమోదం!

ఆర్పీ ఠాకూర్‌కు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పోలీసు అధికారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాజకీయాలతో పోలీసులను టార్గెట్ చేయడం చాలా బాధాకరమన్నారు. ఐపీఎస్‌కు ఎలా సెలక్ట్‌ అవుతారో కూడా తెలియని రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండటం బాధాకరమని వారు వ్యాఖ్యానించారు. ఎంతో సామర్థ్యం ఉంటేనే సివిల్‌ సర్వీస్‌కు ఎంపిక అవుతారని, ఆ విషయం కూడా ఎమ్మెల్యే ఆర్కేకి తెలిసినట్లు లేదన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులకు ఆయన సహకరించాలన్నారు.

English summary
Vijayawada: The Andhra Pradesh Police Officers Association demands apology from Mangalagiri YCP MLA RK over the comments made on ACB DGP Thakur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X