చంద్రబాబుకు హ్యాపీ - టీడీపీ అభ్యర్ధులకు బీపీ, పవన్ అనూహ్య ట్విస్ట్..!!

పొత్తులపై పవన్ స్పష్టమైన ప్రకటన చేసారు. బీజేపీని ఒప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలను చెప్పకనే చెప్పారు. ముఖ్యమంత్రి పదవి పైనా తాను పట్టుబట్టటం లేదని తేల్చి చెప్పారు. ఇది పవన్ అభిమానుల కు రుచించకపోయినా..చంద్రబాబుకు హ్యాపీ ఇచ్చే మాట. కానీ, అక్కడే అసలు ట్విస్టు ఇచ్చారు. సీట్ల పైన మాత్రం పట్టు వీడనని పవన్ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే ఒక సంఖ్య పైన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అదే ఇప్పుడు టీడీపీ అభ్యర్దుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

తేల్చేసిన పవన్:వచ్చే ఎన్నికల్లో పొత్తుల పైన పవన్ కీలక ప్రకటన చేసారు. బీజేపీతో చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తే మూడు పార్టీలు, లేకుంటే టీడీపీ-జనసేన పొత్తు అనే విధంగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పొత్తుల కోసం కొన్ని సార్లు ఒప్పుకోకపోవచ్చని..కానీ, రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్షన్‌ ఫిగర్స్‌ చూపించైనా ఒప్పిస్తామని చెప్పుకొచ్చారు. బలంగా ఉన్న పార్టీలు కలవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో సీఎం రేసులో తాను లేనని స్పష్టంగా చెప్పారు. కష్టపడి పని చేస్తే ముఖ్యమంత్రి పదవి అనేది వరించి తీరాలి. దాని కోసమే పని చేస్తున్నానని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి పదవి కోసం తాను వెంపర్లాడనని తేల్చి చెప్పారు. ఇది పవన్ అభిమానులకు నిరాశ మిగిల్చితే, టీడీపీ శ్రేణులకు జోష్ ఇస్తోంది.

Pawan Kalyan out of CM race Chandrababu gets relief,

టీడీపీ అధినేతకు రిలీఫ్:ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి పైన పవన్ నుంచి ఎటువంటి షరతులు ఉండవని క్లారిటీ వచ్చింది. ఇది టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ తన ప్రకటనతో పెద్ద రిలీఫ్ ఇచ్చారు. దీని ద్వారా అధికారంలోకి వస్తే జనసేన భాగస్వామి కావటం మినహా ముఖ్యమంత్రి పదవిలో ప్రచారం జరుగుతున్నట్లుగా షేరింగ్ కోరే అవకాశం లేదని స్పష్టత వచ్చింది. ఇప్పుడు బీజేపీ కలిసి వస్తే మూడు పార్టీలు కలిసి ఎన్నికల పొత్తు పైన ప్రకటన చేసే అవకాశం ఉంది. కానీ, బీజేపీ కలిసొచ్చేలా ఎటువంటి సానుకూల సంకేతాలు కనిపించటం లేదు. బీజేపీ రాకపోయినా ఈ రెండు పార్టీల పొత్తు ఖాయం. ఇదే సమయంలో పవన్ మరో కీలక అంశం ప్రస్తావించారు తమ .ఓటుబ్యాంకు ఇప్పుడు గత ఎన్నికల కంటే రెట్టింపయిందని చెప్పారు.

సీట్ల పంపకాలే కీలకం:ఇప్పుడు ఈ వ్యాఖ్యలే టీడీపీలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీని ద్వారా జనసేన తాను కోరుకున్న విధంగా సీట్లను సాధించేందుకు పట్టు పట్టటం ఖాయంగా కనిపిస్తోంది. సీఎం పదవి వద్దని చెప్పటం ద్వారా పొత్తు మార్గం క్లియర్ చేసిన పవన్..ఇప్పుడు చంద్రబాబు కు ముందు 40 సీట్ల వరకు డిమాండ్ పెట్టేందుకు సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం. టీడీపీ 20 సీట్ల వరకు జనసేనకు ఇచ్చేందుకు సిదకదమైంని చెబుతున్నారు. బీజేపీ కూడా కలిస్తే ఈ సంఖ్య మరింత పెరగనుంది. అదే ఇప్పుడు టీడీపీలో అసలు సమస్యగా మారుతోంది. మొత్తంగా 40-45 సీట్లు పొత్తులో భాగంగా వదులుకోవటానికి టీడీపీలో అభ్యర్దులు త్యాగరాజులుగా మారాల్సిన అవసరం ఉంటుంది. ఇది వైసీపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో, సీట్ల విషయంలో ఇప్పుడు పవన్ ప్రతిపాదనలు..చంద్రబాబు నిర్ణయాలు టీడీపీ ఆశావాహుల్లో కొత్త ఆందోళనకు కారణమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+