హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పీకల్లోతు మునిగారు, పడవలో దరి చేర్చారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో వేలాది గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఊరే ఏరుగా కనిపిస్తోంది. జనం అల్లాడిపోతున్నారు. నష్టం రూ.1868 కోట్ల వరకు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు 28 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. 42 మంది వరకు మృతి చెందారు. నాలుగు వేలకు పైగా గ్రామాల్లో ప్రజలు నీటిలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. అల్పపీడనం, బలమైన ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలూ అల్లాడిపోతున్నాయి.

మరో రెండురోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, సీమ, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండొచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర ఒణికిపోతోంది. చాలా రైళ్లు రద్దయ్యాయి. కొన్నింటిని దారి మళ్లించారు.

వర్షం 1

వర్షం 1

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని ఫరీదుపేట గ్రామం జలదిగ్బంధంలో ఉన్న దృశ్యం. రోడ్ల పైనే కాకుండా పలు ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి.

వర్షం 2

వర్షం 2

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో నడుం లోతు వరకు నీరు వచ్చిన ఆర్టీసి కాంప్లెక్స్. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షం 3

వర్షం 3

గత ఏడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విశాపట్నం జిల్లాలోని మునగపాక మండలంలో నీట మునిగిన చూచుకొండ గ్రామం.

వర్షం 4

వర్షం 4

భారీ వర్షాలకు విశాఖపట్నం జిల్లాలోని మునగపాక మండలంలోని గణపర్తి గ్రామం నీట మునిగింది. స్థానిక దేవాలయం, ఇళ్లలోకి నీరు వచ్చింది.

వర్షం 5

వర్షం 5

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలంలోని దేవీనగర్‌లో పడవల పైన సహాయ చర్యలు చేపడుతున్న రెస్క్యూ టీం. పలు గ్రామాలు నీట మునిగాయి.

వర్షం 6

వర్షం 6

వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస రైల్వే స్టేషన్‌లో రైలు పట్టాల పైకి వచ్చిన వర్షపు నీరు దృశ్యం.

English summary
Incessant rains lashing AP for the last six days have claimed 42 lives so far in various rain-related incidents. About eight lakh hectares of crops have been left inundated and nearly 85,000 people have been evacuated to safer places and 225 relief camps have been set up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X