ap rains: జోరువానలు.. పెరుగుతున్న గోదావరి ఉధృతి, ఆ మండలాల్లో ఆందోళన!!
ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. జూలై 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏ జిల్లాలో వర్షం నమోదవుతుంది అన్న వివరాలను వెల్లడిస్తోంది.
నేడు ఈ జిల్లాలలో మోస్తరు వర్షాలు
ఈరోజు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఉత్తరకోస్తా తీరం మీదుగా ఆవర్తనం విస్తరించి ఉంది. దీనిప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరువర్షాలు కురిసే అవకాశం ఉంది.

పిడుగులతో కూడిన వర్షాలు.., జాగ్రత్త
అలాగే విశాఖ,కాకినాడ,కోనసీమ,ఉభయగోదావరి,ఏలూరు, కృష్ణా,బాపట్ల,ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించిన క్రమంలో పిడుగులు విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కిందకు వెళ్లకూడదని, ఉరుములు మెరుపులు వస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని పేర్కొంది.
రైతులు, పొలం పనులు చేసేవారు, పశువుల కాపరులు చెట్ల క్రిందకు వెళ్లొద్దు
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలు,పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రిందకు వెళ్లడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది . వర్షాల విషయంలో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెల్లడించింది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు, ఎగువన కరుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతి పెరిగింది.
పెరుగుతున్న గోదావరి ఉధృతి.. ఈ మండలాల ప్రజలు ఆందోళనలో
ధవళేశ్వరం వద్ద 10 అడుగులకు పైగా వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై ఉన్న 60 గేట్లను 0.25 మిల్లీమీట్లర మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. అయితే పెరుగుతున్న గోదావరి వరద కారణంగా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా, దేవీపట్నం, చింతూరు, కూనవరం , ఏటపాక, వీఆర్ పురం మండలాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.












Click it and Unblock the Notifications