అమరావతి: రోడ్లు ఇలా, భూములిచ్చిన రైతులకు జనవరి 1న ప్లాట్లు

అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం సమీపిస్తుండటంతో అమరావతిలో రహదారుల వ్యవస్థను ప్రభుత్వం ఆవిష్కరించింది. విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణంపై సింగపూర్ ఆర్కిటెక్ట్‌లు అధ్భుతమైన ప్లాన్ ఇచ్చారని చెప్పారు.

ముఖ్యంగా రాజధాని రోడ్ల విషయంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను కనబరిచింది. దేశవ్యాప్తంగా రాజధాని నగరాల్లో ఎక్కడా లేని విధంగా వంపులు లేకుండా, సమాంతరంగా అత్యున్నత ప్రమాణాలతో రహదారులను నిర్మించనుంది. రెండు మూడు చోట్ల గ్రామ కంఠాలకు ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతో తప్పనిసరై 'వీ' ఆకారంలో రోడ్లను మలుపు తిప్పారు.

అమరావతిలో 200 అడుగుల వెడల్పుతో 64 కిలోమీటర్లు, 165 అడుగుల వెడల్పుతో 104 కిలోమీటర్లు, 130 అడుగుల వెడల్పుతో 146 కిలోమీటర్లు పొడవున మూడు రోడ్లు రానున్నాయని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రాజధానిలో రహదారులు వంకరటింకర లేకుండా నేరుగా ఉండేలా చూశారు.

AP Road network the best in the country says minister Narayana

భూసమీకరణకు సహకరించిన గ్రామస్థులకు ఇచ్చిన హామీ మేరకు గ్రామకంఠాల అస్తిత్వానికి ఏ మాత్రం భంగం కలగకుండా రహదారులు, కాలువల వ్యవస్థలను ప్రభుత్వం రూపొందించింది. రాజధాని నిర్మాణం కారణంగా ఎక్కడా ఏ గ్రామాన్నీ తొలగించడం లేదని, ఎవరినీ ఇబ్బందుల పాలు చేసే ఉద్దేశం లేదని చెప్పారు.

భూములు ఇచ్చిన వారికి 2016 జనవరి ఒకటో తేదీన ప్లాట్లు అందచేస్తామని తెలిపారు. ఆలోగా లేఔట్లు వేసి రైతులకు వారికి రావాల్సిన వాటా ప్లాట్లను కేటాయిస్తుందన్నారు. రైతుల ఆలోచనలను దృష్టిలో ఉంచుకొని వాస్తుతో కూడిన ప్లాట్లు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు.

లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందని, పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తామని తెలిపారు. అమరావతి చిహ్నం మన సంస్కృతి సంప్రదాయం, చరిత్రను ప్రతిబింబించేలా ఉంటుందని, ఇందుకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని తెలిపారు. ఉత్తమ చిహ్నాన్ని నిపుణుల కమిటీ ఎంపిక చేస్తుందని, దానికి బహుమతి కూడా ఇస్తామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+