ఏపీలో మరో ఎన్నికల సమరం- షెడ్యూల్ విడుదల : టార్గెట్ కుప్పం- రిపీట్ అవుతుందా ..!!
ఏపీలో మరో ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. ఏపీలో పెండింగ్ లో ఉన్న నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 12 మున్సిపాల్టీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీని పైన ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ నెల 14,15,16 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఎన్నికలు జరగని ప్రాంతాలతో పాటుగా..గెలిచిన అభ్యర్ధులు మరణించిన మున్సిపల్ - పంచాయితీ..జెడ్పీటీసీ-ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి.

నెల్లూరుతో పాటుగా 12 మున్సిపాల్టీల్లో
ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నెల్లూరు కార్పొరేషన్ తో పాటుగా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాల్టీలు..ఆకీవీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచర్ల, కమలాపురం,రాజంపేట, పెనుకొండ లో ఎన్నికల జరగనున్నాయి. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా మున్సిపాల్టీలకు ఈనెల 15న పోలింగ్ జరగనుంది. 17వ తేదీన మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు కౌంటింగ్ నిర్వహిస్తారు.

పెండింగ్ లో ఉన్న అన్ని ఎన్నికలు పూర్తి
ఇదే విధంగా..14వ తేదీన పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపీ వ్యాప్తంగా మొత్తంగా 498 గ్రామ పంచాయతీల పరిధిలోని 69 సర్పంచ్ పదవులకు, 533 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నిక జరిగిన రోజునే అంటే 14వ తేదీ సాయంత్రమే పంచాయితీలకు కౌంటింగ్ జరగనుంది. 15న మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేసిన తరువాత...16వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికల నిర్వహాణకు నిర్ణయించారు.18వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కౌంటింగ్ జరగనుంది.

కుప్పం పైనే స్పెషల్ ఫోకస్
రాష్ట్ర మొత్తం మీద వివిధ కారణాలతో 187 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గ్రేటర్ విశాఖలో రెండు డివిజన్ స్థానాలకు ఎన్నికలు జరగుతాయని ప్రకటించింది. ఇక, ఆరు మున్సిపల్ కార్పోరేషన్‌ల పరిధిలోని 10 డివిజన్‌ల్లో ఎన్నికలు..అదే విధంగా.. 12 మున్సిపాల్టీల్లోని 13 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కుప్పం రాజకీయంగా ఆసక్తి కర ఎన్నికగా మారుతోంది. కుప్పంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కావటంలో అక్కడ వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.

సార్వత్రిక సమరానికి ముందు ఇవే చివరి ఎన్నికలు
అయితే, చంద్రబాబు ఇప్పటికే రెండు రోజులు పాటు కుప్పంలో పర్యటించారు. అక్కడ ఎలాగైనా మున్సిపాల్టీ వైసీపీకి వెళ్లకుండా చూసేందుకు కసరత్తు చేసారు. స్థానిక నాయకత్వానికి దిశా నిర్దేశం చేసారు. అదే విధంగా పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి..గురజాల ఎన్నికలు సైతం టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఆసక్తి కరంగా మారుతోంది. ఈ ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి రానుంది. ఇక, రేపు బద్వేలు బై పోల్ ఫలితాలు వెల్లడైన తరువాత ఈ ఎన్నికల పైన రాజకీయంగా ఆసక్తి పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల అయింది. ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు ఎమ్మెల్సీలను ఎంపిక చేయాల్సి ఉంది. దీంతో..ఏపీలో రాజకీయంగా తిరిగి సందడి మొదలైంది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications