వైజాగ్‌కు దిగ్గజ సంస్థలు - డెలాయిట్ సహా, కీలక ఒప్పందాలు..!!
విశాఖకు దిగ్గజ సంస్థలు రానున్నాయి. ఈ మేరకు రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం లో ఆమోదం లభించింది. ఈ సమావేశంలో మొత్తం 29 పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులపై సీఎం చర్చించారు. దాదాపు రూ.22 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులపై ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఇందులో విశాఖ కేంద్రం గా ఏర్పాటు కానున్న దిగ్గజ సంస్థలు ఉన్నాయి.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐబీపీ సమావేశం జరిగింది. అందులో రూ.526.25 కోట్ల పెట్టుబడులతో 10 ఐటీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం లభించింది. వీటి ద్వారా విశాఖపట్నంలో భారీగా ఐటీ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. విశాఖపట్నంలో దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డెలాయిట్ (Deloitte) భారీ పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది. విశాఖలో 2,500 సీట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆపరేషన్స్ సెంటర్ ఏర్పాటుకు రూ.43.75 కోట్ల పెట్టుబడితో డెలాయిట్ ప్రణాళికకు ఆమోదం లభించింది. అదే విధంగా వైజాగ్ వేదికగా ఐటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆపరేషన్స్ కోసం 2,400 సీట్లతో రూ.100 కోట్ల పెట్టుబడితో ముత్తూట్ ఫిన్‌కార్ప్ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసారు. నేడు ఆమోదం పొందిన 10 ఐటీ ప్రాజెక్ట్‌లలో 7 క్వాంటం ప్రాజెక్టులు ఉన్నాయి.

దుగ్గరాజపట్నంలో పోర్టు కోసం
విశాఖను గ్లోబల్ టెక్ హబ్‌గా మార్చే దిశగా ఎస్ఐపీబీ సమావేశంలో పలు ఐటీ ప్రాజెక్ట్‌లకు ఆమోదముద్ర వేసారు. ఇప్పటివరకు జరిగిన 20 ఎస్ఐపీబీ సమావేశాల్లో 359 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. రూ.13.84 లక్షల కోట్ల పెట్టుబడులు, 10.59 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ సమావేశంలో కొత్త పెట్టుబడుల ప్రతిపాదనలతో పాటు పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల అమలు, ఉద్యోగాల కల్పనకు సంబంధించిన అంశాలపై చర్చించి..కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అదే విధంగా దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు దిశగా ఎండీఎల్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ ఎంవోయూ చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.15,000 కోట్ల పెట్టుబడితో 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏడాదికి 12 లక్షల టన్నుల నౌకల నిర్మాణ సామర్థ్యాన్ని ఈ గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ కలిగి ఉంది.













Click it and Unblock the Notifications
