నిరుద్యోగులకు శుభవార్త...భారీ సంఖ్యలో టీచర్ పోస్టుల భర్తీ...

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఇది నిజంగా శుభవార్తే...ప్రభుత్వ ఉద్యోగం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయుల నిరీక్షణ ఫలించింది..ఎట్టకేలకు వారు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది...టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.

భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ....

భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ....

టీచింగ్ కోర్సులు పూర్తి చేసి గవర్నమెంట్ టీచర్ పోస్టు సాధించేందుకు నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఇది నిజంగా తీపి కబురే....ఉరుము లేని పిడుగులా అనూహ్యంగా ఎపి ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీకి నోటిపికేషన్ జారీ చేసింది. అంతేకాదు నిరుద్యోగులు అంచనాకు మించి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ఈ నోటిఫికేషన్ ద్వారా చేపట్టనున్నారు. 12,370 టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వచ్చే విద్యాసంవత్సరం లోపు ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ధరఖాస్తుల స్వీకరణ ఇలా...

ధరఖాస్తుల స్వీకరణ ఇలా...

ఈనెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. అయితే ఆన్ లైన్ ద్వారానే ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. అప్లికేషన్స్ స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి 8.

హాల్ టికెట్...పరీక్ష...ఇతర వివరా

హాల్ టికెట్...పరీక్ష...ఇతర వివరా

డిఎస్సీ పరీక్ష హాల్ టికెట్స్‌ను మార్చి 9వ తారీఖు నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మార్చి 23, 24, 26 తేదీల్లో డీఎస్సీ పరీక్ష ఉంటుంది. పరీక్షల అనంతరం మే 5న మెరిట్‌ లిస్టు ప్రకటన చేస్తారు.

నియామకాలు ఎప్పుడంటే...

నియామకాలు ఎప్పుడంటే...

వచ్చే విద్యాసంవత్సరం లోపు ఈ టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసెయ్యాలని ప్రభుత్వం భావిస్తోంది. అంటే జూన్ 12న పాఠశాలల పున:ప్రారంభంలోపు డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేస్తామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి జూన్ 8 నుంచి 11 లోపు పోస్టింగ్స్ ఇస్తామన్నారు. స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, సెకండ్ గ్రేడ్ టీచర్స్, పీఈటీ, ఇతరులు అన్నీ కలిపి 10,313 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు తొలి దశ మోడల్‌ పాఠశాలల్లో 1197 ఉద్యోగాలు, ప్రత్యేక అవసరాలు కల్గిన విద్యార్థుల కోసం మరో 860 ఉద్యోగాలు కలిపి మొత్తం 12వేల 370 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని మంత్రి గంటా వెల్లడించారు.

డిఎస్సీ నోటిఫికేషన్...ముఖ్యమైన తేదీలు...

డిఎస్సీ నోటిఫికేషన్...ముఖ్యమైన తేదీలు...

డీఎస్సీ నోటిఫికేషన్‌ - డిసెంబర్‌ 15న.... దరఖాస్తుల స్వీకరణ: (ఆన్‌లైన్‌లో మాత్రమే) డిసెంబర్‌ 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు చివరి తేదీ: మార్చి 9.... రాత పరీక్షలు : మార్చి 23,24,26... రాత పరీక్ష కీ విడుదల : ఏప్రిల్‌ 9న
కీ పై అభ్యంతరాల స్వీకరణ: ఏప్రిల్‌ 10 నుంచి 16 వరకు....తుది కీ విడుదల తేదీ: ఏప్రిల్‌ 30... మెరిట్‌ లిస్ట్‌ ప్రకటన : మే 5
ప్రొవిజనల్‌ సెలక్షన్‌ విడుదల చేసి అభ్యర్థులకు సమాచారం ప్రక్రియ: మే 11...సెలక్టెడ్ క్యాండిడేట్స్ ధ్రువీకరణ పత్రాల పరిశీలన: మే 14 నుంచి 19

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
amaravathi: Andhra pradesh state government released the AP DSC 2018 Notification for the recrutiment to the posts of school Assistants(S.A), language pandits,Secondary grade Teachers (SGT),Physical Education Teachers, in Government ,Zilla parishad,Mandal parisad and Muncipal schools in the state through District Selection(DSC).The applications are required from eligible candidates to submit through online at www.apdsc.cgg.gov.in.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X