మైగాడ్.. ఆదిపురుష్ తెలుగు సినిమా రైట్స్..
భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలు తమ బడ్జెట్ ఎంతైందనే విషయాన్ని బహిరంగంగా వెల్లడించరు. వీటిపై మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా కనీసం ఖండించడం కూడా చేయరు. అభిమానులు, ట్రేడ్ వర్గాలు ఎవరికి వారుగా వారికి తెలిసిన బడ్జెట్ అంకెలను లెక్కలోకి తెస్తారు. ఆదిపురుష్ సినిమా తెలుగు హక్కులు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
బ్యానర్ అధినేత టీజీ విశ్వప్రసాద్ రూ.165 కోట్లకు కొన్నామని ఓపెన్ గానే చెప్పేశారు. జీఎస్టీ కూడా కలుపుకుంటే రూ.185 కోట్లు అవుతుంది. టి సిరీస్ తో తమ సంస్థకున్న అనుబంధంవల్లే ఇది సాధ్యపడిందన్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ రావాలంటే ఏపీ, తెలంగాణ నుంచి రూ.200 కోట్లు రావాలి. ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ బజ్ కు టాక్ తోడైతే సులువుగానే కలెక్షన్స్ వసూలు చేయవచ్చు. ఒకటీ అరా మినహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లన్నీ ప్రభాస్ సినిమా ప్రదర్శిస్తాయి.

ధియేటర్ ఉన్న ప్రతి ఊరిలో సినిమా వేయడానికి బయ్యర్లు సిద్ధమవుతున్నారు. డిమాండ్ కూడా అలాగే ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ కి తీవ్ర ఒత్తిడి ఉంది. అనుమతులవల్ల ఆన్ లైన్ బుకింగ్ కొంత ఆలస్యమైంది. అయినా క్షణాల్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ప్రభాస్ ది మరో సినిమా స్పిరిట్ కూడా తామే కొన్నామని విశ్వప్రసాద్ స్పష్టతనిచ్చారు. మారుతి దర్శకత్వంలో తీస్తున్న మూవీని పీపుల్స్ మీడియా నిర్మాణంలో ఉంచింది. దీంతో మూడు సినిమాలు తన ఖాతాలో వేసుకొంది. టాప్ బ్యానర్ గా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని నిలపడానికి వరుసగా భారీ ప్రాజెక్టులు చేసుకుంటూ వస్తున్నారు. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో మీద ఇప్పటికే అంచనాలు తారస్థాయికి చేరాయి.












Click it and Unblock the Notifications