• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబు ఉద్వేగం: గందరగోళం, ఈనాడు విలేకరికి టీడీపీ రూ.లక్ష (పిక్చర్స్)

By Srinivas
|

మహబూబ్ నగర్: తెలుగుదేశం పార్టీ నాయకుల తయారీ కర్మాగారం అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తామని, ఇక్కడి నాయకులకు పార్టీలో స్వేచ్చా వాతావరణాన్ని కల్పించామన్నారు.

తెలంగాణలో బలపడవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు టీడీపీని ఎవరూ దెబ్బతీయలేరని, ముఖ్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సైనికుల్లాంటి కార్యకర్తలున్నారన్నారు. తనకు ఆంధ్ర, తెలంగాణలు రెండూ సమానమేనని, విభజన భౌగోళికంగా జరిగినప్పటికినీ తెలుగు ప్రజలు కలిసి ఉండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి జరగాలన్నదే తన అభిమతమన్నారు.

ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేసి కార్యకర్తల కష్టాన్ని తుంగలో తొక్కి వారి త్యాగాలను విస్మరించి, పార్టీకి ద్రోహం చేసి వెళ్తే భవిష్యత్తులో దేనికీ పనికి రాకుండా పోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు పోతే వందమంది నాయకులను తయారు చేసుకుంటామన్నారు. టిడిపిని దెబ్బతీయాలని ఎన్నోసార్లు పన్నాగాలు పన్నారని, ఇప్పుడు కూడా అదే జరుగుతోందని, అంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదన్నారు.

మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి

కుట్ర రాజకీయాలు, నీచ రాజకీయాలు చేసే వారు బాగుపడరని, వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. విభజన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయని, వాటిని సరిదిద్దుకునేందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రస్తుతం పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉందని, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉందని, అందుకే ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఐదారు రాష్ట్రాలలో పోటీ చేస్తామని, దాదాపు 76 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

జాతీయ పార్టీగా రూపాంతరం చెందబోతున్నామని, నాయకులు, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉందంటే అది తాను చేసిన కష్టమేనని అన్నారు. దృఢ సంకల్పంతో కార్యకర్తలు ముందుకెళ్లాలని, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పని చేయాలని, ప్రజల పక్షాన నిలవాలని, బుల్లెట్‌లా దూసుకెళ్లాలని బాబు పిలుపునిచ్చారు.

 చంద్రబాబు

చంద్రబాబు

మే నెలలో బ్రహ్మండంగా మహానాడును ఏర్పాటు చేసుకోబోతున్నామని తెలిపారు. తెలంగాణలో టీడీపీ పూర్వ వైభవాన్ని ఏ శక్తీ అడ్డుకోలేదన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

నాయకుల వలసలు, పార్టీపై దుష్ప్రచారాలు చూపే ప్రభావం తాత్కాలికమే అన్నారు. తెలంగాణలో టీడీపీ చేసిన అభివృద్ధే మన బలం, మన విశ్వసనీయత అని, దానిని దెబ్బతీయడం ఎవరి తరం కాదన్నారు. దాని ఆధారంగానే టీడీపీ మళ్లీ బలపడుతుందన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

మహబూబ్‌నగర్ పట్టణంలో సుమారు 3 గంటలపాటు సాగిన ర్యాలీ అనంతరం వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు, తెలంగాణ అమరవీరుల స్థూపం ప్రతిమలకు నివాళులు అర్పించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణలో తెలుగుదేశానికి ఉక్కులాంటి కార్యకర్తల బలం ఉందని, ఇంతటి క్రమశిక్షణ కలిగిన క్యాడర్‌ మరే పార్టీకీ లేదు. సామాజిక న్యాయం ఆచరించి చూపడం టీడీపీ బలమన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

మండుటెండలు, అకాల వర్షాలు పార్టీ శ్రేణుల్లోని ఉత్సాహాన్ని, ఉక్కు సంకల్పాన్ని నిరోధించలేకపోతున్నాయని ఈ సభ మరోసారి నిరూపించిందని, తెలంగాణలో టీడీపీ నేతలు, కార్యకర్తలు గతంలో తీవ్రవాదుల దాడులను ఎదుర్కొన్నారన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఆ తర్వాత ఎన్నో అవమానాలు, అణిచివేతను, దుష్ప్రచారాలను ఎదుర్కొన్నారని, అయినా పార్టీ పట్ల అచంచల విశ్వాసం, నమ్మకంతో నిలబడ్డారని, ఇటువంటి పార్టీకి అధ్యక్షునిగా ఉండటం తన అదృష్టమని చంద్రబాబు భావోద్వేగంతో అన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

తెలంగాణలో ప్రజలు, పార్టీ కార్యకర్తలకు తాను ఏ అన్యాయం జరగనీయనని తెలిపారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పార్టీని ఎన్నో ఇబ్బందులకు గురి చేసినా కార్యకర్తలు పార్టీని కాపాడుకున్నారని, వారికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

పార్టీ కార్యకర్తలందరి సంక్షేమాన్ని కుటుంబ పెద్దగా తాను చూసుకుంటానని, న్యాయపరంగా, చట్టపరంగా, ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. కార్యకర్తలకు బీమా సౌకర్యం కూడా కల్పించామని, అదే పద్ధతిలో ప్రసవ సమయంలో ఇబ్బంది పడే మహిళలకు ప్రత్యేక బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. మాదిగలకు న్యాయం చేసింది, చేయబోయేదీ టీడీపీనే అని ప్రకటించారు.

సభలో గందరగోళం

సభలో గందరగోళం

పాలమూరు చంద్రబాబు సభలో గురువారం సాయంత్రం గందరగోళం చెలరేగింది. ఎమ్మార్పీఎస్ అలజడి సృష్టించింది. చంద్రబాబు ప్రసంగం ప్రారంభం కాగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కుర్చీలు, చెప్పులు, రాళ్లు విసిరారు.

సభలో గందరగోళం

సభలో గందరగోళం

ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. ఈనాడు ఫోటో గ్రాఫర్ తలకు గాయమైంది. ఆయనకు చంద్రబాబు పార్టీ తరఫున రూ.లక్ష పరిహారం ప్రకటించారు.

సభలో గందరగోళం

సభలో గందరగోళం

ఎమ్మార్పీఎస్ అలజడి నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు వారిని వెంటాడబోయారు. చంద్రబాబు వారిని వారించారు. ఇలాంటి సభల్లో అలాంటి వారు మామూలేనని, తమ డిమాండ్లను వ్యక్తం చేసే స్వేచ్ఛ వారికి ఉందని చెప్పారు.

సభలో గందరగోళం

సభలో గందరగోళం

పాలమూరు చంద్రబాబు సభలో గురువారం సాయంత్రం గందరగోళం చెలరేగింది. ఎమ్మార్పీఎస్ అలజడి సృష్టించింది. చంద్రబాబు ప్రసంగం ప్రారంభం కాగానే ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు కుర్చీలు, చెప్పులు, రాళ్లు విసిరారు.

సభలో గందరగోళం

సభలో గందరగోళం

ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. ఈనాడు ఫోటో గ్రాఫర్ తలకు గాయమైంది. ఆయనకు చంద్రబాబు పార్టీ తరఫున రూ.లక్ష పరిహారం ప్రకటించారు.

సభలో గందరగోళం

సభలో గందరగోళం

ఎమ్మార్పీఎస్ అలజడి నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు వారిని వెంటాడబోయారు. చంద్రబాబు వారిని వారించారు. ఇలాంటి సభల్లో అలాంటి వారు మామూలేనని, తమ డిమాండ్లను వ్యక్తం చేసే స్వేచ్ఛ వారికి ఉందని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
AP, Telangana Must Emerge as Top States in Development: Chandrababu Naidu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more