డిసెంబర్18 నుంచి ఎపి టెట్ ధరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
అమరావతి: ఏపీలో డిసెంబర్ 18 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష-టెట్ ధరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి జనవరి 1 వరకు ధరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది.
టెట్ ఫీజు చెల్లించేందుకు డిసెంబర్ 30 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది. జనవరి 17 నుంచి 27 వరకు ఏపీ టెట్ నిర్వహించనున్నారు. జనవరి 8 నుంచి వెబ్‌సైట్‌లో నమూనా పరీక్షలు, జనవరి 9 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం కల్పించనున్నారు. పేపర్-1 ఉదయం 9.30 నుంచి 12 వరకు, పేపర్-2 ; మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. జనవరి 29న ప్రాథమిక కీ, ఫిబ్రవరి 6న తుది కీ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 8న టెట్ ఫలితాలను విడుదల చేస్తారు.












Click it and Unblock the Notifications