Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాలివాన బీభత్సం! కుప్పకూలిన మేయర్ కుమారుడి పెళ్లి సెట్టింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా తన ముఖచిత్రాన్ని మార్చుకుంది. ఎండల తీవ్రత పెరుగుతుందనుకుంటున్న తరుణంలో, ఉపరితల ఆవర్తనాలు, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రకృతి కన్నెర్రజేసింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో గాలివాన సృష్టించిన బీభత్సం సామాన్య ప్రజలను భయాందోళనకు గురిచేసింది.

అమరావతి వాతావరణ కేంద్రం అందించిన తాజా నివేదిక ప్రకారం, దక్షిణ కర్ణాటక పరిసరాల్లో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం మరియు అక్కడి నుంచి మహారాష్ట్రలోని మరాఠ్వాడా వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా రాష్ట్రంలో అస్థిర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

AP Weather News Thunderstorm Alert for North Coastal Regions 5-Day Forecast Released by Amaravati IMD

గాలి వాన భీభత్సం..

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో బుధవారం మధ్యాహ్నం ప్రకృతి ప్రకోపం స్పష్టంగా కనిపించింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పెందుర్తి పరిసర ప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. ఈ గాలివాన ధాటికి బీఆర్టీఎస్‌ ప్రధాన రహదారి వెంబడి ఉన్న భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు కాగితాల్లా గాలిలో ఎగిరిపోయాయి. మరీ ముఖ్యంగా, సరిపల్లి సమీపంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కుమారుడి వివాహం కోసం అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన భారీ పెళ్లి సెట్టింగ్ ఈ ఈదురు గాలులకు తట్టుకోలేక కుప్పకూలిపోయింది. వివాహ వేడుక కోసం చేసిన ఏర్పాట్లు ధ్వంసం కావడంతో అక్కడ భారీ నష్టం వాటిల్లింది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..

రాబోయే వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. గురువారం (ఫిబ్రవరి 26) ఉత్తర కోస్తాంధ్ర, యానాం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అలాగే తీర ప్రాంత జిల్లాల్లో తెల్లవారుజామున తేలికపాటి పొగమంచు కురిసే అవకాశం ఉందని, ఇది వాహనదారులకు ఇబ్బంది కలిగించవచ్చని పేర్కొన్నారు. వాయువ్య- ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వల్ల రాబోయే 48 గంటల పాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుందని, వర్ష సూచన లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే అకస్మాత్తుగా వీస్తున్న గాలుల దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా రైతులు తమ పంట కోతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఆవర్తనం వల్ల ఉష్ణోగ్రతల్లో స్వల్ప మార్పులు సంభవించవచ్చని, తీర ప్రాంత ప్రజలు వాతావరణ మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+