Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నవ్యాంధ్రలో నవశకం - 26 జిల్లాల రాష్ట్రంగా : నేడే ఆవిష్కరణ - 42 ఏళ్ల తరువాత..!!

ఆంధ్రప్రదేశ్ లో కీలక ఘట్టం మరి కాసేపట్లో చోటు చేసుకోనుంది. రాష్ట్ర విభజన తరువాత 13 జిల్లాలతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలకు పెరిగింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరన తో నవశకానికి నాంది పలకనుంది. సుదీర్ఘ కసరత్తు అనంతరం ప్రభుత్వం ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు పైన తుది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రోజున ఉదయం 9.05 - 9.45 గంటల మధ్య సీఎం జగన్ కొత్త జిల్లాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 23 రెవెన్యూ డివిజన్లతో కలిపి మొత్తం 73 రెవెన్యూ డివిజన్లు సోమవారం నుంచే పనిచేయడం ప్రారంభించనున్నాయి.

సీఎం జగన్ లాంఛనంగా ఈ రోజు

సీఎం జగన్ లాంఛనంగా ఈ రోజు


ఆగమశాస్త్ర పండితులు ఇచ్చిన సూచనల మేరకు ముహూర్తం ఖరారు చేసారు. ఈ మేరకే అన్ని జిల్లాల్లో ఒకేసారి పాలన ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఆ వెంటనే కలెక్టర్‌, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, పోలీసు సూపరింటెండెంట్‌, జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీవోలు బాధ్యతలు స్వీకరించనున్నారు. వారితో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడతారు. కొత్త జిల్లాలు, పరిపాలన, ప్రభుత్వ లక్ష్యాలపై దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే కొత్త జిల్లాలకు కలెక్టర్..జాయింట్ కలెక్టర్..ఎస్పీ.. డీఆర్వీలు..ఎమ్మార్వోలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల కేటాయింపు పూర్తయింది. ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో సగటున ఆరు, ఏడు, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.

42 ఏళ్ల తరువాత కొత్త జిల్లాలతో

42 ఏళ్ల తరువాత కొత్త జిల్లాలతో

18 నుంచి 23 లక్షల జనాభా ఉంటుంది. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, దూరం దృష్ట్యా అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం మాత్రం రెండు ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటైంది. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యంపై లోతైన అధ్యయనం, ప్రజల నుంచి వచ్చిన 17,500 పైగా విజ్ఞప్తుల పరిశీలన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన జిల్లాలు ఏర్పాటయ్యాయి. 26 జిల్లాల్లో ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఆరు.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలు ఉన్నాయి. కోస్తాలో 12 జిల్లాలు.. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు.. రాయలసీమలో 8 జిల్లాలు.. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ , అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.

నేటి నుంచే కొత్త జిల్లాల్లో పాలన

నేటి నుంచే కొత్త జిల్లాల్లో పాలన

ఈ నిర్ణయం ద్వారా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో కీలక హామీ అమలు దిశగా సీఎం అధికారికంగా జిల్లాలను ప్రారంభిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రకాశం జిల్లా అత్యంత పెద్ద జిల్లాగా అవతరించింది. ఇది 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాష్ట్రంలో పెద్ద జిల్లాగా అవతరించగా.. విశాఖపట్నం అత్యంత చిన్నజిల్లాగా మారింది. విజయవాడ కేంద్రంగా టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరుమీద ఎన్టీఆర్‌ జిల్లా పేరు పెట్టారు. ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయిబాబా పేరుతో శ్రీ సత్యసాయి జిల్లాను ఏర్పాటుచేశారు. కొత్త జిల్లాల్లో 70 శాతం కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని చోట మాత్రమే ప్రైవేట్‌ భవనాలు ఎంపిక చేశారు. 42 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత ఏడు దశాబ్దాల రాష్ట్ర చరిత్రలో కొత్తగా ఒకే సారి 13 జిల్లాలు ఈ రోజు ఏర్పాటు అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+