టార్గెట్ జగన్: ఢిల్లీలో మకాం వేసిన వైఎస్ షర్మిల
YS Shamila: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. షెడ్యూల్ విడుదలకు ఎంతో సమయం లేదు. రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ వెలువడొచ్చు. దీనితో పాటే- దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుంది. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం-జనసేన ఇప్పటికే తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి.
ఈ పరిస్థితుల్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ కదనరంగంలోకి దూకింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకున్న కాంగ్రెస్.. ఆయా పార్టీలకు ధీటుగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడింది. ఈ జాబితా రూపకల్పన కోసం చేపట్టిన కసరత్తు తుదిదశకు చేరుకుంది. దీనిపై పార్టీ అధిష్ఠానం ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

ఈ క్రమంలో- ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల.. దేశ రాజధానిలో మకాం వేశారు. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నాయకుడు మధుసూదన్ మిస్త్రీతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో సుమారు మూడు గంటలకు పైగా ఈ భేటీ కొనసాగింది.
అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడారు. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయని వెల్లడించారు. ఇంకొన్ని సీట్లపై కసరత్తు కొనసాగుతోందని, ఈ రాత్రికి లేదా గురువారం మధ్యాహ్నానికి ఖరారవుతుందని అన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసే మూడో జాబితాలో వారి పేర్లు ఉంటాయని చెప్పారు.
గతంలో ప్రకటించిన లోక్‌సభ ఇన్‌ఛార్జీల అభ్యర్థిత్వాన్నే దాదాపుగా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అరకు (ఎస్టీ రిజర్వుడ్)- జగత శ్రీనివాస్, శ్రీకాకుళం- మీసాల సుబ్బన్న, విజయనగరం- బొడ్డేపల్లి సత్యవతి, విశాఖపట్నం, కొత్తూరి శ్రీనివాస్ ఇన్‌ఛార్జీలుగా ఉన్నారు.
అనకాపల్లి- సనపల అన్నాజీరావు, కాకినాడ- కేబీఆర్ నాయుడు, అమలాపురం (ఎస్సీ రిజర్వుడ్)- వెంకట శివప్రసాద్, రాజమండ్రి- ముశిని రామకృష్ణ, నరసాపురం- జెట్టి గురునాథరావు, ఏలూరు- కనుమూరి బాపిరాజు, మచిలీపట్నం- కొరివి వినయ్ కుమార్ ఇదివరకే ఇన్‌ఛార్జీలుగా నియమించింది కాంగ్రెస్.
విజయవాడ- డాక్టర్ మురళీ మోహన్ రావు, గుంటూరు- గంగిశెట్టి ఉమాశంకర్, నరసరావుపేట- వీ గురునాథం, బాపట్ల (ఎస్సీ)- శ్రీపతి ప్రకాశం, ఒంగోలు- యూ వెంకట్రావు యాదవ్, నంద్యాల- బండి జకారియా, కర్నూలు- పీఎం కమలమ్మ, అనంతపురం- ఎన్ శ్రీహరి ప్రసాద్, హిందూపురం- షేక్ సత్తార్, కడప- ఎన్ సుధాకర్ బాబు, నెల్లూరు- ఎం రాజేశ్వరరావు, తిరుపతి (ఎస్సీ)- షేక్ నజీర్ అహ్మద్, రాజంపేట- డాక్టర్ ఎన్ తులసీరెడ్డి, చిత్తూరు (ఎస్సీ- డీ రామ్ భూపాల్ రెడ్డి ఇన్‌ఛార్జీలుగా కొనసాగుతున్నారు.












Click it and Unblock the Notifications