జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నాడా?

YS Sharmila: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తప్పుపట్టారు. ఈ నిర్ణయం సరైంది కాదని చెప్పారు. ప్రజలు ఓటేసి గెలిపించింది అసెంబ్లీకి వెళ్లడానికేనని, అధికార పార్టీ చేస్తోన్న తప్పులను ఎత్తిచూపడానికేనని గుర్తు చేశారు.

అసెంబ్లీలో అడుగు పెట్టకపోవడం వైఎస్ జగన్ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే వెళ్తానంటూ మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసిందని చురకలు అంటించారు.

APCC Chief YS Sharmila slams YS Jagan

వైసీపీ ఎమ్మెల్యేలను జనం గెలిపించింది ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదని హితవు పలికారు. జగన్ స్వయం కృతాపరాధం ఆ పార్టీని ప్రతిపక్ష హోదాకి దూరం చేసిందని, ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానని భీష్మించడం అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అనేది ఓ దేవాలయంతో సమానమని, ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీయడానికి ప్రజలు ఇచ్చే ఓ గొప్ప అవకాశమని షర్మిల వ్యాఖ్యానించారు. అలాంటి అవకాశాన్ని వైఎస్ జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఉద్దేశపూరకంగా చేజార్చుకుంటోన్నారని ఆరోపించారు.

చంద్రబాబు- పవన్ కల్యాణ్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేకుండా పోయిందని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవట్లేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందంటూ షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.

మహిళలపై దాడులు ఆగట్లేదని, రాష్ట్రంలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని, బెల్టు షాపుల దందాకు బ్రేకులు పడట్లేదని, ఈ అయిదు నెలల్లో ఒక్క ఖాళీ కూడా భర్తీ కాలేదని షర్మిల చెప్పారు. కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటోన్న ఇన్ని వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం వైసీపీకి ప్రజలు ఇస్తే- ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాం అనడం సిగ్గు చేటని చెప్పారు.

ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా వైఎస్ జగన్‌కు లేకపోవడం బాధాకరమని షర్మిల చెప్పారు. 1994లో 26 సీట్లకే పరిమితం అయినా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కుంగిపోలేదు. ప్రతిపక్ష హోదా కావాలని మారం చేయలేదని ఆమె గుర్తు చేశారు.

26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలిచామని, ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించామని షర్మిల వివరించారు. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అడగలేదని చెప్పారు. ఎలాంటి హోదా లేకపోయినా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎండగట్టారని పేర్కొన్నారు.

ఇప్పటికైనా జగన్ తన పిచ్చితనాన్ని పక్కన పెట్టి అసెంబ్లీకి వెళ్లాలని, కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని షర్మిల అన్నారు. అసెంబ్లీకి వెళ్లే దమ్ము ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుడు ఇంట్లో కాదు..ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోవచ్చని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+