వైఎస్ జగన్‌తో ఏపీఎన్జీవో నేతల భేటీ..!!

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాన్ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ నాయకులు.. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డిని కలిశారు. కొద్దిసేపటి కిందటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఏపీఎన్జీవోల మహాసభలకు హాజరు కావాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు.

ఈ నెల 21, 22వ తేదీల్లో ఏపీఎన్జీవోల రాష్ట్రస్థాయి మ‌హాస‌భ‌ల‌ు జరుగనున్నాయి. 21వ మహాసభలు ఇవి. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ప్రతిష్ఠాత్మకంగా వీటిని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా పూర్తి చేస్తోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఏపీఎన్జీవో నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.

APNGO leaders meets CM YS Jagan

25 వేల మందికి పైగా ఉద్యోగులు, ఏపీఎన్జీవో సభ్యులు, జిల్లాస్థాయి నాయకులు, ప్రతినిధులు హాజరు కావొచ్చనే అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు మహాసభలకు వైఎస్ జగన్.. ముఖ్యఅతిథిగా హాజరవుతారని ఎన్జీఓ నాయకులు చెబుతున్నారు. ఈ మేరకు ఆయనను కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. జ‌గ‌న్‌ను క‌లిసిన వారిలో ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్ చంద్రశేఖర్‌ రెడ్డి ఉన్నారు.

ఈ సభల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల.. ఎదుర్కొంటోన్న సమస్యలు, వాటిని పరిష్కరించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఏర్పాటు చేసిన 12వ పీఆర్సీ కమిషన్‌ అంశం కూడా ప్రస్తావనకు రానుంది. ఈ పీఆర్సీ కమిషన్‌‌కు రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారి డాక్టర్ మన్మోహన్‌ సింగ్‌ను ఛైర్మన్‌గా నియమించింది ప్రభుత్వం.

కరోనా వైరస్ సోకి మృత్యువాత పడిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా ఒకేసారి కారుణ్య నియామకాలు చేపట్టడానికీ ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీన్ని మరింత సరళీకరించాలని, ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలని ఏపీఎన్జీవో నాయకులు కోరుకుంటోన్నారు. ఈ విషయంపైనా మహాసభల్లో చర్చిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+