APPSC Notification: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్-897 గ్రూప్ 2 పోస్టుల ప్రకటన..

ఏపీలో ఎన్నికల వేళ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 897 గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు కలిపి 897 ఉన్నాయి. వీటి భర్తీ కోసం ఏపీపీఎస్సీ ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో ఉద్యోగాల పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా అన్ని వివరాలను ఇచ్చింది. అలాగే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును కూడా ఇచ్చింది.

APPSC released notification for 897 group-2 posts including executive and non-executive

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 897 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో మొత్తం 331 ఎగ్జిక్యూటివ్ పోస్టులతో పాటు 566 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్టార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, పంచాయతీ రాజ్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్లు, ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్లు, చేనేత శాఖలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులున్నాయి.

నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో రాష్ట్ర సచివాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సీనియర్ ఆడిటర్లు, సీనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు, జూనియర్ అసిస్టెంట్ల ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకోవాలనే వారు ఏపీపీఎస్సీ వెబ్ సైట్లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు. అలాగే దరఖాస్తు చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదలైన ఇవాళ్టి నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకూ గడువు ఇచ్చారు.

గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం నిర్వహించే పరీక్షల వివరాలను కూడా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ లో ఇచ్చింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష తేదీని ఆ తర్వాత ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (సీపీటీ) నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధించిన వారికే ఉద్యోగాలు లభిస్తాయని ఏపీపీఎస్సీ తెలిపింది.

స్క్రీనింగ్ టెస్టులో ఆఫ్ లైన్ మోడ్ లో ఓఎంఆర్ విధానంలో ఆబ్జెక్టివ్ పరీక్ష ఉంటుందని ఏపీపీఎస్సీ తెలిపింది. మెయిన్స్ పరీక్షలోనూ ఆబ్జెక్టెవ్ టెస్ట్ ఉంటుందని, లేదా కంప్యూటర్ ద్వారా పరీక్ష నిర్వహిస్తామని, ఇందులో తుది నిర్ణయం కమిషన్ తీసుకుంటుందని తెలిపారు. మరోవైపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నాటికి అంటే ఇవాళ్టికి అర్హతలు కలిగి ఉండాలని, అలాగే ప్రాక్టికల్ అనుభవం కూడా కలిగి ఉండాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం అభ్యర్దులు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ http://www.psc.ap.gov.in లో చూడాలని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+