భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!!
తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఒక వైపు ఎండలు మండుతుంటే.. మరో వైపు వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాలపై నున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అదే విధంగా ఇతర ప్రాంతాల్లో వడగాల్పులు.. ఉష్ణోగ్రతలు పెరుతాయని అప్రమత్తం చేసింది. రానున్న మూడు రోజులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల వేళ పలు జిల్లాలకు కీలక సూచనలు చేసింది. కొన్ని ప్రాంతాల్లో ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతోందని, ఉత్తర తమిళనాడు పరివాహక ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయల సీమలో అక్కడక్కడా ఉరుములు మెరుపులతో జల్లులకు అవకాశం ఉందని ప్రకటించింది. కాగా, రానున్న మూడు రోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ, కర్ణాటకలో ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

వడగాల్పులు.. ఇటు వర్షాలు
కాగా, ఉదయం ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇక.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల మధ్య చాలాచోట్ల 40 డిగ్రీల కు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఏప్రిల్ 11న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 12వ తేదీ నుంచి పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు.. 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. 13వ తేదీ నుంచ 17 వరకు వాతావరణం పొడిగే ఉండనుంది. ఇక.. అధిక ఉష్ణోగ్రతలు, తేమతో కూడిన ఉక్కపోత వాతావరణం ఉంటుందని అంచనా వేసింది.












Click it and Unblock the Notifications