అరుణాచలం, పళని సహా ప్రముఖ క్షేత్రాల దర్శనం - APSRTC స్పెషల్ ఆఫర్..!!

ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణీకుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల వేళ బంపరాఫర్ ప్రకటించింది. దక్షిణాదిన ప్రముఖ ఆలయాల సందర్శన వీలుగా కొత్తగా ప్యాకేజీ ఖరారు చేసింది. మొత్తం 8 రోజుల పాటు కొనసాగే ఈ ప్యాకేజీ కింద సందర్శించే ఆలయాలను ప్రకటించారు. ఇదే సమయంలో సూపర్ లగ్జరీ బస్సులో, టీవీ సౌకర్యంతో ఈ టూర్ కొనసాగుతుందని వెల్లడించింది. పూర్తి ప్యాకేజీ వివరాలను ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

ఏపీ నుంచి దక్షిణాదిన ఉన్న ప్రముఖ ఆలయాల సందర్శన కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీని తాజా గా ప్రకటించింది. రావులపాలెం నుంచి తమిళనాడు, కేరళలోని పలు ఆలయాలు ఈ ప్రయాణం లో దర్శించుకునే విధంగా టూర్ ప్రణాళిక ఖరారు చేసారు. జాబితాలో ప్రముఖ శైవక్షేత్రాలైన అరుణాచలం, రామేశ్వరం ఆలయాలు ఉన్నాయి. ఈ టూర్ లో కాంచీపురం : శ్రీ కామాక్షిదేవి శక్తి పీఠం (తమిళనాడు), అరుణాచలం : శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయం, పళని : శ్రీ సుబ్రహ్మణ్యే శ్వరస్వామి ఆలయం, కోయంబత్తూర్ : శ్రీ ఆదియోగి(ఇషా) (తమిళనాడు), గురువాయర్ : శ్రీ కృష్ణ ఆలయం (కేరళ), త్రివేండ్రం : శ్రీ అనంతపద్మనాభ స్వామి (కేరళ), మధురై : శ్రీ మధురమీనాక్షి ఆలయం (తమిళనాడు), శ్రీవిల్లిపుత్తూరు : శ్రీ గోదాదేవి ఆలయం ఉన్నాయి.

apsrtc-finalized-special-package-for-arunachalam-famous-temples-for-8-days-tour-here-the-details

దర్శించే ఆలయాలు.. ప్యాకేజీ ధరలు

వీటితో పాటుగా కుర్తాళం : శ్రీ కుట్రాళేశ్వరుడు శివుడు (తమిళనాడు), టెంకాశి : శ్రీ కాశీ విశ్వేశ్వరుడు (తమిళనాడు), రామేశ్వరం : శ్రీ రామేశ్వర జ్యోతి లింగం (తమిళనాడు), శ్రీరంగం : శ్రీ రంగనాథ ఆలయం (తమిళనాడు), తంజావూరు : శ్రీ బృహదేశ్వర ఆలయం (తమిళనాడు), కుంభకోణం : శ్రీ విష్ణుదేవుడు, నవగ్రహదేవాలయం సందర్శన ఉంటుందని వెల్లడించారు. ఇక.. ఈ యాత్ర మార్చి 20న ప్రారంభమై 28వ తేదీన ముగుస్తుంది. టూర్ ప్యాకేజీలో భాగంగా ఉదయం అల్పహరం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. టికెట్ ఛార్జీ రూ.9900 గా అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఆర్టీసీ విచారణాధికారి 9959225549 నెంబర్ కు కాల్ చేసి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+