APSRTC గుడ్ న్యూస్- ఇక సీట్ల కొట్లాట లేకుండా: ఉచిత ప్రయాణానికి బూస్ట్

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించడానికి ఏపీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోన్నారు. వివిధ నగరాలు, జిల్లా కేంద్రాలకు మరిన్ని ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు బస్సులను అందుబాటులోకి వస్తోన్నారు. రద్దీ మార్గాల్లో వాటిని ప్రవేశపెడుతున్నారు. కార్తీక మాసంలో మహిళా ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

ఈ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. ఉచిత బస్సు పథకాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. దీనికి ఉద్దేశించిన స్త్రీశక్తి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో ఏపీఎస్ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ ఎప్పటికప్పుడు తీర్చేస్తోంది.

APSRTC gets Rs 400 Crore for Free Women s Bus Services

ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం 400 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దీనికి సంబంధించిన జీవోను రవాణా మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు విడుదల చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మూడు నెలల కాలానికి ఈ 400 కోట్ల రూపాయల నిధులు వర్తిస్తాయి. స్రీశక్తి పథకాన్ని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ మొత్తాన్ని రీఎంబర్స్ చేసింది.

కార్తీకమాసం నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. మూడో సోమవారం 90 శాతం ఆక్యుపెన్సీ రికార్డయింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రీజియన్లల్లో ఆర్టీసీ బస్సులన్నీ రద్దీగా నడిచాయి. ముఖ్యంగా ఆలయాలు, సందర్శనీయ స్థలాలకు రాకపోకలు సాగించే బస్సులు కిక్కిరిశాయి. శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి శైవక్షేత్రాలకు భక్తులు భారీగా తరలివెళ్లారు. ఈ నెల ప్రారంభం నుంచి కూడా సగటున 75 నుంచి 80 శాతం వరకు ఆక్యుపెన్సీ నమోదవుతోంది. పంచారామాలకు కూడా ప్రతి శని, ఆదివారాల్లో పంచారామ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తోన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+