ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం: ఇక డైరెక్టుగా ఇంటికే
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) తన సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఏపీఎస్ఆర్టీసీ పార్సిల్ సేవలతోపాటు డోర డెలివరీ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామని సంస్థ సహాయ మేనేజర్ (సరుకు రవాణా) షేక్ అజ్మతుల్లా తెలిపారు.
పార్సిల్ బుక్ చేస్తే ఏపీ పరిధిలోని 84 ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఎక్కడైనా (పది కిలో మీటర్ల పరిధిలో) డోర్ డెలివరీ సదుపాయం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని 84 నగరాల్లో ఎక్కడైనా డోర్ డెలివరీ సదుపాయం ఉంది. హైదరాబాద్‌లో మాత్రం డోర్ డెలివరీ సదుపాయం లేదని, కేవలం బుక్ చేసుకునేందుకు మాత్రమే అవకాశం ఉందని అజ్మతుల్లా తెలిపారు.

హైదరాబాద్ నగరంలో మొత్తం 64 బుకింగ్ ఏజెన్సీలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 25 వరకు డోల్ డెలివరీ మాసోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక కేజీ పార్సిల్ కు డోర్ డెలివరీ ఛార్జీ రూ. 15, ఆరు కిలోల వరకు రూ. 30, పది కిలోల వరకు రూ. 36, 25 కిలోల వరకు రూ. 48, 25 కిలోల నుంచి 50 కిలోల వరకు రూ. 59గా నిర్ణయించినట్లు వివరించారు.
మరిన్ని వివరాల కోసం 7993081100 ఫోన్ నెంబర్ సంప్రదించాలని ఆయన సూచించారు. కాగా, ఆర్టీసీ ద్వారా పార్శిల్, కొరియర్ డెలివరిలను ప్రొత్సహించేందుకు ఈ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లుగా ఆర్టీసీ తెలిపింది. సామాన్యులు సైతం వెచ్చించె స్థాయిలో ధరలను నిర్ణయించినట్లు ఆర్టీసీ వివరించింది. పార్శిల్, కొరియర్ వంటి వాటిని ఆర్టీసీ ఇకపై డోర్ డెలివరి చేయనుంది.












Click it and Unblock the Notifications