కార్తీక మాసంలో రూ.2 వేలకే పంచారామాల దర్శనం - టూరిజం స్పెషల్ ప్యాకేజీ..!!
కార్తీక మాసం పంచారామాల సందర్శన కు చాలా ముందు ఆసక్తి చూపుతారు. కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్తారు. దీంతో, ప్రఖ్యాత పంచారామల సందర్శనకు వీలుగా ఏపీ టూరిజం శాఖ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. రూ 2 వేలతోనే పంచారామల సందర్శన కలిగేలా ప్యాకేజీ ఖరారు చేసింది. కార్తీక మాసంలో మూడు సార్లు ఈ రకమైన ప్యాకేజీతో భక్తులకు పంచారామల సందర్శనకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
కార్తీక మాసం వేళ ఏపీ పర్యాటక శాఖ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ప్రతి సోమవారం విజయవాడలోని ఏపీ టూరిజం కార్యాలయం నుంచి ఈ బస్సులు బయల్దేరతాయని ఏపీటీడీసీ తెలిపింది. అక్టోబర్ 27, నవంబర్ 3, 10, 17 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. పంచారామాల దర్శనానికి పెద్దలకు రూ.2130, పిల్లలకు రూ.1760 చొప్పున టికెట్ ధరను నిర్ణయించింది. బుకింగ్‌ల కోసం www.tourism.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. బుకింగ్, ఇతర వివరాల కోసం 98480 07025, 84990 54422, 1800 4254 5454 నంబర్లలో సంప్రదించాలని పేర్కొంది.

ఇటు శైవ క్షేత్రాల్లోనూ కార్తీక మాసం వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుండటంతో ప్రముఖ ఆలయాలను అలంకరిస్తున్నారు. ఇక.. ఆర్టీసీ సైతం భక్తుల డిమాండ్ మేరకు పంచారామలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. మరో వైపు ఏపీలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా పలు నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ప్రసాద్ పథకం కింద రూ. 25 కోట్ల 32 లక్షలతో అన్నవరం దేవస్థానంలో భక్తులకు మౌలిక వసతుల కల్పన చేస్తున్నారు. రూ. 172.35 కోట్లతో గండికోట, అఖండ గోదావరి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద అరకు-లంబసింగి, సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.127.39 కోట్లు వెచ్చిస్తున్నారు. ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్ కింద రూ. 49.49 కోట్లతో అహోబిలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్యాకేజీకి వచ్చే స్పందనకు అనుగుణంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోనుంది.












Click it and Unblock the Notifications