మంచు కురిసే వేళలో.. అరకు అందాలు; పోటెత్తిన పర్యాటకులు!!
అసలే శీతాకాలం.. ఆపై వణికించే చలి.. ఈ శీతాకాలంలో మంచు కురిసే వేళలో అరకు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలోని అరకు అందాలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం అరకు, పాడేరు, వంజంగి ప్రాంతాలలో పర్యాటకుల సందడి కనువిందు చేస్తుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు,అరకు పర్యాటక ప్రాంతాలలో దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఏజెన్సీ అందాలను తిలకించేందుకు వచ్చారు. ప్రతి సంవత్సరం ఏడాది చివరి డిసెంబర్ నెలలో ఏజెన్సీ వ్యాప్తంగా మంచు దుప్పటి కప్పుకునే సమయంలో మంచు కొండల సోయగాలను చూసేందుకు, కొండ కోనల నుండి జాలువారే జలపాతాలను తిలకించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు.

ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకులోయ అందాలను పర్యాటకులు ఆస్వాదిస్తున్నారు. చలిమంచులలో అక్కడి గిరిజనుల జీవన విధానానికి ముగ్ధులు అవుతున్నారు. గిరిజనుల సాంస్కృతిక దింసా నృత్యాన్ని తిలకించి పరవశించిపోతున్నారు. అరకు, పాడేరు అందాలను తిలకిస్తున్న పర్యాటకులు వారి కెమెరాలలో ఛాయాచిత్రాలను బంధించుకుంటున్నారు. ప్రతి ఏడాది ఈ నెలలో పర్యాటకుల తాకిడి విశాఖ ఏజెన్సీ ప్రాంతాలకు అధికంగా ఉంటుంది.
ఈ క్రమంలో ఈ నెలలోనూ విపరీతంగా పర్యాటకుల తాకిడి పెరిగింది. అరకు, వంజింగిల్లో ఈ నెలలో మేఘాలు పాల సముదాన్ని తలపిస్తాయి. ఇక్కడ సూర్యోదయాన్ని చూడడం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. చాలా అందమైన సూర్యోదయాన్ని ఇక్కడ పర్యాటకులు ఎంజాయ్ చేస్తారు.
మరోవైపు పాడేరు జలపాతాలను చూసేందుకు సైతం పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. పాడేరు, అరకు, చింతపల్లిలో కనీస ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోగా, వణికించే చలిలో కూడా పర్యాటకులు ఈ ప్రాంతాల అందాలను ఎంజాయ్ చేస్తున్నారు. బొర్రా గుహలు, గిరిజన మ్యూజియం, చాపరాయి జలపాతాలు, పూదోటల అందాలు విశాఖ ఏజెన్సీ కి వచ్చే పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.
అరకు అందాలను చూస్తున్న పర్యాటకులు అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందుతున్నారు. తన్మయత్వంలో మునిగిపోతున్నారు. ఇంత గొప్ప ప్రకృతి రమణీయత, గొప్ప సంపదగా చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications