Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Araku tourism: మేఘాల కొండల్లో విహరిస్తూ ఉదయ భానుడ్ని పలకరించాలా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సీజన్లో అందాల అరకు పర్యాటకులకు కనువిందు చేస్తుంది. పచ్చని అడవి, ఎత్తైన కొండలు, జలపాతాల మధ్య మేఘాల దారుల్లో తిరుగుతున్నట్టు అక్కడికి వెళ్ళిన పర్యటకులందరికీ ఒక వింత అనుభూతి కలుగుతుంది. శీతాకాలంలో అరకులోని ప్రకృతి సోయగాలు మరింత రమణీయంగా పర్యాటకులను పిలుస్తున్నాయి. ఆంధ్ర ఊటీ అరకు ప్రకృతి ప్రేమికులను రారమ్మని పిలుస్తోంది.

తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో రాత్రివేళలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గడిచిన వారం రోజుల నుంచి రాత్రి ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదల నమోదు అవుతుంది. పాడేరు, అరకు, చింతపల్లి మినుములూరు లాంటి శీతల ప్రదేశాలలో 9, 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Araku tourism Greet early morning sun rise while strolling in the cloud hills

మాడగడ మేఘాల కొండల అందాలు
ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉండటంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో పర్యాటకులు పెద్ద ఎత్తున ఏజెన్సీ ప్రాంతానికి తరలివస్తున్నారు. నవంబర్, డిసెంబరు నెలలలో అరకు ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. పచ్చని వలిసే పూల అందాలతో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇక అరకు లోయ నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మాడగడ మేఘాల కొండలు చాలా ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగిస్తాయి .

కళ్ళముందు ఆవిష్కృతం అవుతున్న అందమైన ప్రకృతి దృశ్యం
అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరికి తాము మేఘాలలో నడుస్తున్నట్టు పాల సముద్రం పై తేలుతున్నట్టు ఒక సుందరమైన అనుభూతి కలుగుతుంది. అందమైన ప్రకృతి దృశ్యం కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. ఇక ఈ అందాలన్నింటినీ చూడడానికి పర్యాటకులు అరకుకు పోటెత్తుతున్నారు. గజగజ వణికే చలిలో కూడా కాలినడకన మేఘాల కొండమీదకి వెళ్లి అక్కడ ఉదయిస్తున్న సూర్యుడి పలకరింత కోసం ఎదురుచూస్తున్నారు.

దింసా నృత్యాలతో సందడి
సూర్యోదయాన్ని చూసి పర్యాటకులు పులకించిపోతున్నారు. ఇక మేఘాల కొండపై నుండి గిరిజనుల దింసా నృత్యాలు మరింత ఆకర్షణగా కనిపిస్తున్నాయి. అక్కడికి వెళ్లే పర్యటకులు వాళ్ళలానే అలంకరించుకొని వారితో కలిసి స్టెప్పులేసి సందడి చేస్తున్నారు. అక్కడి ప్రకృతి అందాలను కెమెరాలలో బంధిస్తూ కొత్త అనుభూతి చెందుతున్నారు. మేఘాల కొండ వద్దకు వచ్చే పర్యాటకులను ఆకట్టుకోవడం కోసం వారికి వినోదాన్ని పంచడం కోసం అనేక రకాల ఏర్పాట్లు చేశారు స్థానికులు.

నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలోనే... అరకు వెళ్ళి రండి
మట్టి పాత్రలను తయారు చేయడం, గిరిజన సంప్రదాయ డప్పు వాయిద్యాలు, ఊయలలు, గుర్రపు స్వారీలు ఇలా అనేక ఏర్పాట్లతో పర్యాటకులను ఆకట్టుకుంటున్నారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలోనే ఈ ప్రకృతి అందాల కుమ్మరింత చోటు చేసుకునే నేపథ్యంలో చాలామంది ప్రకృతి ప్రేమికులు అరకు బాట పడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునేవారు అందాల ఆంధ్ర ఊటీని ఒక్కసారి చూసి రండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+