శ్రీశైలం వెళ్తున్న భక్తులకు అలెర్ట్.. వారికి స్ట్రాంగ్ వార్నింగ్!

శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు చాలామంది భక్తులు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళుతూ ఉంటారు. ఇక ఈ క్రమంలో శ్రీశైలం ఆలయంతోపాటు శ్రీశైలం పరిసర ప్రాంతాలను కాలుష్య రహితంగా చేయాలని భావించిన శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన శ్రీశైలంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.

శ్రీశైలంలో పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణకు కీలక నిర్ణయం
పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం నల్లమల అటవీ ప్రాంతంలో ఉండడంతో ఆలయానికి వస్తున్న భక్తులు ప్లాస్టిక్ ని వినియోగించడం వల్ల, పర్యావరణానికి హాని జరగడమే కాకుండా వన్యప్రాణులకు కూడా హాని చేకూరుతుంది. ఈ క్రమంలోనే శ్రీశైలంలో ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడానికి నిర్ణయం తీసుకున్నారు.

Are you going to Srisailam But you must know this there plastic usage completely banned

శ్రీశైలం వచ్చే భక్తులకు సూచన
శ్రీశైలం వచ్చే భక్తులు ఎవరూ ప్లాస్టిక్ బ్యాగ్స్ తీసుకురావద్దని ఈవో సూచనలు చేశారు. అలాగే వ్యాపారులకు నిషేధ నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా మరో మారు మల్లికార్జున స్వామి కళ్యాణమండపంలో వ్యాపార సంఘాల ప్రతినిధులు, సత్ర నిర్వాహకులు, చిరు వ్యాపారులతో సమావేశం నిర్వహించిన టిటిడి ఈవో ప్లాస్టిక్ నిషేధం పైన వారికి అవగాహన కలిగించారు.

వారికి హెచ్చరిక
గతంలో అనేకమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, అయినప్పటికీ కొందరు వ్యాపారులు ఇంకా ప్లాస్టిక్ వాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. దేవస్థానం సూచించిన ప్రత్యామ్నాయాలను ఉపయోగించకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. పేపర్ కవర్లు, జ్యూట్ బ్యాగులు, బట్టల సంచులను వాడాలని, వచ్చే భక్తులకు కూడా వాటిని అందుబాటులో ఉంచాలని ఈవో శ్రీనివాసరావు సూచించారు.

శ్రీశైలంలో కఠినంగా ప్లాస్టిక్ నిషేధం అమలు
ఆలయంలో లడ్డు ప్రసాదాల కోసం ఉపయోగించే డిఆర్డిఓ బయో కంపోస్ట్ కవర్లను కూడా వినియోగించవచ్చు అని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక అధికారులు తనిఖీలను పటిష్టం చేయాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి మొదట జరిమానా విధించి ఆ తర్వాత కూడా వినకపోతే లైసెన్సులు రద్దు చేయాలని ఈవో సూచించారు. అయితే చాలా సంవత్సరాలుగా శ్రీశైలంలో ప్లాస్టిక్ పైన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, ప్రస్తుతం దానిని కఠినంగా అమలు చేయాలని, అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+