ఫేస్ బుక్ పరిచయం పెళ్ళికి దారితీసింది, చివరికిలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం:ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఈ పరిచయం వారిద్దరి మద్య ప్రేమకు దారితీసింది. ప్రేమికులు పెద్దలకు చెప్పకుండా వివాహం చేసుకొన్నారు.అయితే పెళ్లిచేసుకొన్న యువతిని ఆ వరుడు వదిలివెళ్ళడంతో బాధితురాలు అత్తింటి ముందు న్యాయపోరాటానికి దిగింది.

అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలానికి చెందిన అరుణశ్రీ అనే యువతితో పెద్దవడుగూరు మండలం ఆవులాంపల్లికి చెందిన సుదర్శన్ ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకొన్నాడు. ఈ పరిచయం వారిద్దరి మద్య ప్రేమకు దారితీసింది.

arunasri and sudarshan fell in love with facebook

కర్నూల్ జిల్లాలోని బుగ్గరామలింగేశ్వరస్వామి ఆలయంలో వారిద్దరూ ఈ నెల 10వ, తేదిన వివాహం చేసుకొన్నారు. అయితే పెద్దలకు తెలియకుండానే వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులు వారిని ఇంట్లోకి రానివ్వలేదు.

నూతన వధూవరులు పామిడిలోని ఓ బట్టల దుకాణానికి వచ్చారు. కొత్త బట్టలు కొనుగోలు చేసి వివాహనికి వెళ్ళాలని నిర్ణయించారు. అయితే వస్త్ర దుకాణం వద్దే సుదర్శన్ ఆ యువతిని వదిలేసి వెళ్ళిపోయాడు.

అయితే ఆ యువకుడు ఎంతసేపటికి రాకపోయేసరికి ఆ యువతి ఆవులాంపల్లి గ్రామానికి వెళ్ళి వరుడి ఇంటి ముందు బైఠాయించింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.అయితే ఆ యువతికి ఇప్పటికే రెండు పెళ్ళిళ్ళు జరిగాయని తన కొడుకును మోసం చేసి మరోసారి వివాహం చేసుకొందని వరుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.మరో వైపు తనకు న్యాయం చేయాలని యువతి అరుణశ్రీ కోరుతోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
arunasri and sudarshan fell in love wiht face book.sudarshan married arunasri on march 10, their parents didn't know marriage. sudarshan disapper from march 16,arunasri dharna in front of sudarshan house.
Please Wait while comments are loading...