టిడిపి వైపు అశోక్ బాబు చూపు: పిలిస్తే పరిశీలన

కాకినాడ: తెలుగుదేశం తనను ఆహ్వానిస్తే ఆ పార్టీలో చేరే విషయం పరిశీలిస్తామని ఎపి ఎన్జీవోల సంఘం నాయకుడు అశోక్‌బాబు చెప్పారు. ఎమ్మెల్సీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో ఉద్యోగ సంఘాల అభిప్రాయం కూడా తీసుకుంటే మంచిదన్నారు.

విజయవాడలో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్లనే ఉద్యోగులు తాత్కాలిక రాజధానికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదని ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుందని అశోక్‌బాబు ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అశోక్ బాబు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మద్దతుతో ఆయన రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగులను కూడగట్టారు.

Ashok Babu intention to join in TDP

ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితులుగా మారారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన చేసిన చంద్రబాబు ఉద్యోగుల సహకారం అత్యవసరంగా మారింది. దీంతో చంద్రబాబు ఉద్యోగులు తన వైపు ఉండే విధంగా వ్యూహరచన చేస్తూ వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+