న్యాయం చేయమంటే...అవినీతి ఆరోపణలు చేస్తారా:నారా లోకేష్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగితే అవినీతి ఆరోపణలు చేస్తారా అని మంత్రి నారా లోకేష్ లోకేష్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. గుంటూరులో టీడీపీ 37వ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషిచేస్తున్నారని పొగడ్తలు గుప్పించారు. ఎన్నికల యుద్దానికి సన్నద్ధం కావాలని...అన్ని స్థానాల్లో టీడీపీ గెలవాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమపథకాలే టీడీపీని గెలిపిస్తాయని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు కళా వెంకట్రావు, పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎల్.రమణ పలువురు పార్టీ నేతలు హాజరైనారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నేతలు నివాళులర్పించారు.












Click it and Unblock the Notifications