లిఫ్ట్ ఇవ్వనందుకు కారు యజమానిపై తప్పతాగి దాడి: దేహశుద్ధి
గుంటూరు: కారులో లిఫ్ట్ ఇవ్వనందుకు కారు యజమానిని దేహశుద్ధి చేసిన సంఘటన సోమవారం అర్థరాత్రి సమయంలో గుంటూరు జిల్లా యడ్లపాడు వద్ద జరిగింది. చిలకలూరిపేటకు చెందిన యువ పారిశ్రామికవేత్త ఒకరు తన పరిశ్రమలో పనులు ముగించుకుని ఒంటరిగా కారులో ఇంటికి వస్తుండగా యడ్లపాడు సర్వీసు రోడ్డులో నలుగురు వ్యక్తులు కారును అడ్డగించారు.
తమను కారులో చిలకలూరిపేటకు తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. అయితే తప్పతాగి ఉన్న అపరిచితులైన వారిని రాత్రి పొద్దుపోయాక తీసుకువెళ్లలేనని ఆ పారిశ్రామికవేత్త వారితో అన్నాడు. అయితే ఆ సమాధానం నచ్చని నలుగురు యువకులు ఆ పారిశ్రామికవేత్తను విపరీతంగా కొట్టారు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఈ విషయాన్ని అతడు సమీపంలో ఉన్న తమ ఉద్యోగులకు తెలిపాడు.

వారు వచ్చినప్పటికీ ఈ నలుగురు యువకుల దౌర్జన్యం కొనసాగింది. వచ్చిన వారి మోటారు సైకిళ్లను ఎత్తి బావిలో వేశారు. చివరకు ఆ పారిశ్రామికవేత్త గాయాలతో చికిత్సకోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి రాగా డాక్టర్లు అతనికి చికిత్స చేశారు. సమాచారం తెలుసుకున్న యడ్లపాడు పోలీసులు నిర్ఘాంతపోయారు.
ఈ నలుగురు యువకులు విద్యార్థులని వారి దృష్టికి వచ్చింది. వారిలో ఇద్దరు యడ్లపాడుకు చెందినవారు కాగా మరో ఇద్దరు బొప్పూడికి చెందిన వారని పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరికోసం పోలీసులు గాలిస్తున్నారు. యడ్లపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications