అప్పు తీర్చాలన్నందుకు స్త్రీ గొంతు కోశాడు
అనంతపురం/కడప: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలోని కమలానగర్‌లో దారుణమైన సంఘటన జరిగింది. అప్పు తీర్చలేదని ఓ మహిళా గొంతును ఆటో డ్రైవర్ కత్తితో కోశాడు.
మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇంటి పనులు చేసుకుని డబ్బులు సంపాదించే మహిళ నుంచి కృష్ణా రెడ్డి అనే ఆటో డ్రైవర్ 50 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు.
ఆ అప్పు తీర్చాలని అడిగినందుకు ముమైన్ అనే 40 ఏళ్ల మహిళపై ఓ దుండుగుడు హత్యాయత్నం చేశాడు. మహిళను కత్తితో పొడిచి పరారయ్యాడు. కత్తితో పొడిచిన దుండుగుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

దంపతుల ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా కుల్లంపేట మండలం రెడ్డిపల్లి వద్ద విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు.
మృతులను చిన్నమండెం మండలం తాలువాండ్లపల్లె వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications